ఎన్నికల్లో ఎడాపెడా హామీలు ఇవ్వటం మామూలే. అయితే.. ఇలా ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అదే పనిగా సమయం తీసుకోవటం చాలా ప్రభుత్వాలు చేస్తుంటాయి. కొన్ని హామీల అమలుకు అధికారికంగా నిర్ణయం తీసుకోవటం మినహా పెద్దగా పని ఉండదు. కానీ.. ఆ దిశగా అడుగులు వేయటానికే నెలలు గడిచే పరిస్థితి.
ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఉన్న కాస్త సమయంలోనే పాలనను పరుగులు తీయిస్తున్నారు జగన్. ఒకటి తర్వాత ఒకటిగా నిర్ణయాలు తీసేసుకుంటూ.. తాను కోరుకున్న విధంగా పాలనను సెట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పవర్లోకి వస్తే.. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తానన్న హామీకి తగ్గట్లే తాజాగా కొత్త జిల్లాల మీద కసరత్తు ఒక కొలిక్కి తీసుకురావటమే కాదు.. ఆ ఫైలు ను తన వద్దకు జగన్ తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ముసాయిదా రెఢీ అయ్యిందని.. కొత్త జిల్లాలకు సంబంధించి క్లారిటీ వచ్చేసినట్లే చెబుతున్నారు.
ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని.. గిరిజన జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గిరిజన జిల్లాను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం 26 జిల్లాలు అవుతాయి. ఒకవేళ.. ఆ నిర్ణయాన్ని తర్వాత తీసుకోవాలని భావిస్తే.. ఏపీ పాతిక జిల్లాలుగా మారే అవకాశం ఉంది.
కొత్త జిల్లాలు ఏవంటే..?
విశాఖ జిల్లాలో..
అరకు
అనకాపల్లి
తూర్పుగోదావరి జిల్లాలో..
అమలాపురం
రాజమండ్రి
పశ్చిమగోదావరి జిల్లాలో..
నరసాపురం
కృష్ణా జిల్లాలో..
విజయవాడ
గుంటూరు జిల్లాలో..
నర్సరావుపేట
బాపట్ల
కర్నూలు జిల్లాలో..
నంద్యాల
దఅనంతపురం జిల్లాలో..
హిందూపురం
చిత్తూరు జిల్లాలో..
తిరుపతి
కడప జిల్లాలో..
రాజంపేట
+ గిరిజన జిల్లాను ఏర్పాటు చేసిన పక్షంలో దాన్ని ఎలా ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశాఖ నుంచి విడదీసి అరకు జిల్లాగా ఏర్పాటు చేస్తారా? లేదంటే.. శ్రీకాకుళం.. విజయనగరం జిల్లాల మధ్య ఉన్న ఏజెన్సీ ప్రాంతాన్ని పార్వతీపురం జిల్లాగా ప్రకటిస్తారా? అన్న దానిపై స్పష్టత రావటం లేదు. కొన్ని వర్గాల అంచనా ప్రకారం విశాఖ మన్యంలో అరకును జిల్లాగా చేసి.. శ్రీకాకుళం.. విజయనగరం జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాన్ని కొత్తగా జిల్లాగా మార్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. మరి.. జగన్ ఏం చేస్తారో చూడాలి.