కొత్త జిల్లాల కూర్పు ఎలా సాగింది ? ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ?
ఏపీలో కొత్త జిల్లాల హద్దుల్ని ఇలా డిసైడ్ చేశారట
ఏపీలో కొత్త జిల్లాల్ని తీసుకొస్తాన్న హామీ అమల్లోకి వచ్చేసే టైం వచ్చేసింది. సర్వం సిద్ధం చేసి.. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటమే మిగిలి ఉంది. ఇవాళ.. లేదంటే రేపు.. ఒకట్రెండు రోజుల్లోనే కొత్త జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఏపీలో ఉన్న 13 జిల్లాల స్థానే 26 జిల్లాల్ని ఏర్పాటు చేయనున్నారు. అరకు ను రెండు ముక్కలు చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ముఖ్యంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కారణంగా జిల్లా ఒకటి.. నియోజకవర్గం మరొకటి అన్నట్లు కాకుండా చూసుకున్నారు. అంతేకాదు.. ఒక లోక్ సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు కచ్ఛితంగా జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
అంతేకాదు.. ఒక ఎంపీ స్థానం పరిధిలో ఏదైనా అసెంబ్లీ స్థానం.. కొత్తగా ఏర్పడేపక్క జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటే.. దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకునేలా ప్లాన్ చేశారు. ఉదాహరణకు ప్రస్తుతం బాపట్ల గుంటూరు జిల్లాలో ఉంది. దాన్ని కొత్త జిల్లాగా తీసుకోనున్నారు. దీని పరిధిలోకి రావాల్సిన సంతనూతలపాటు ఒంగోలుకు దగ్గరగా ఉంటుంది. అందుకే సంతనూతలపాడును బాపట్ల జిల్లాలో కాకుండా ఒంగోలు జిల్లాలోకి తీసుకునేలా కసరత్తు చేశారు. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
ఇలా అవసరమైన మార్పులు చేర్పులు చేయటం వల్ల కొన్ని జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు.. కొన్ని జిల్లాల్లో 6అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే రానున్నాయి.
8 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటు అయ్యే జిల్లాలు ఇవే
1. ఒంగోలు
2.కర్నూలు
3. శ్రీకాకుళం
4. అనంతపురం (దీన్ని మాత్రం ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు రాప్తాడు చేర్చారు)
6 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటయ్యే జిల్లాలు
1. నంద్యాల
2. విశాఖపట్నం
- అరకు లోక్ సభ నియోజకవర్గాన్ని రెండు ముక్కలుగా చేశారు. ఒకదానికి అల్లూరి సీతారామరాజుపేరుతో పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లాలో మూడే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి.
- రెండో జిల్లాను పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న మన్యం జిల్లాలో కేవలం నాలుగు అసెంబ్లీ స్థానాలే ఉండనున్నాయి.
- జనాభా పరంగా చూస్తే అత్యధిక జనాభా ఉన్న జిల్లా కర్నూలు 23.66 లక్షల మందితో ఉంటే.. అతి తక్కువ జనాభా ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లా 9.54 లక్షల మంది జనాభానే ఉండనున్నారు