విభజన ఎపుడూ రాజకీయాలకే మేలు చేసేది. రెండుగా నిండుగా ఉంటే బలం. దాన్ని చీల్చి సగం చేస్తే అందరూ అంగుష్టమాత్రులు అవుతారు. వారందరి మధ్యన అతి పెద్దగా వెలిగిపోయే వారి వైభవం చెప్పనలవికాదు. దేశంలో రాష్ట్రాలను చిన్నవిగా చేసి విభజినపుడూ ఇదే రాజనీతిని నమ్ముకుంటారు. ఇక రాష్ట్ర పాలకుల చేతిలో విభజన కొరకు ఎన్నో జిల్లాలు ఉంటాయి. వాటిని ఎంత వీలు అయితే అంత చిన్నవిగా చేసుకుంటే పాలనలో నాణ్యత దేముడెరుగు రాజకీయం పక్కాగా పండుతుంది.
ఉదాహరణకు పెద్ద జిల్లాకు మంత్రిగా ఉన్న వారి దర్జా వేరు. అలాగే పార్టీ ప్రెసిడెంట్ గా నియమితులైన వారి నిబ్బరం కూడా జబర్దస్తుగా ఉంటుంది. అదే దాన్ని రెండో మూడో చేస్తే ఒకటికి ముగ్గురు అవుతారు. అపుడు అచ్చంగా వాయిస్ తగ్గిపోవడంలేదా. అదే ఇక్కడ పాలిట్రిక్స్ అన్న మాట. బలమైన నాయకులు ఎపుడు అధినాయకులకు పక్క బెదురుగానే ఉంటారు. వారిని వారి స్థాయిని ఎంత మేరకు వీలైతే అంతలా తగ్గిస్తే పైన అందలాల మీద ఉన్న అయ్యవార్లకు అంత సేఫ్.
అదే టైమ్ లో రాజకీయ జీవులకు ఒక పేరాశను పెడతారు. పెద్ద జిల్లాకు ఒక్కరే మంత్రిగా ఉంటారు. ఒక్కరే పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటారు. దాన్ని రెండు మూడు చేస్తే ఇద్దరు ముగ్గురు మంత్రులు వస్తారు. అలాగే పార్టీ ప్రెసిడెంట్లూ వస్తారు. నామినేటెడ్ పదవులూ బోలేడు పుట్టుకువస్తాయి. అలా పదవుల ఆశతో దిగువ నాయకులు జోగుతూంటే అయిన వారి రాజకీయ పబ్బం అలా గడచిపోతుంది. కానీ తమ నెత్తిన చిన్న టోపీలే ఉన్నాయన్న స్పృహ కానీ ఆలోచన కానీ రాజకీయ పదవుల పందేరాల కోసం పరుగులు పెట్టేవారికి తట్టకపోవడమే అసలైన మాయ.
తెలంగాణా ఏపీ నుంచి విడిపోయాక అక్కడ ఉన్న జిల్లాలు అచ్చంగా పది మాత్రమే. మరి ఆ పెద్ద జిల్లాలకు మంత్రులు అంటే చిన్నసైజు చీఫ్ మినిస్టర్ల కిందనే లెక్క. వారి దూకుడు కూడా అలాగే ఉంటుంది. 2016లో కేసీయార్ తెలంగాణాలో కొత్త జిల్లాలు మరో పది పదిహేను అంటూ మొదలెట్టి చివరాఖరుకు తేల్చింది ఏంటి అంటే 33 అని నంబర్ కి ఫిక్స్ అయ్యాకన్నమాట.
ఇక వీటితో ఫస్ట్ మంత్రులు చిన్నబోయారు. ఆనక కలెక్టర్లు, ఎస్పీలు సైతం తమ కుర్చీలు చిన్నవి చేసుకుని సెటిల్ అవాల్సి వచ్చింది. అదే టైమ్ లో పది జిల్లాలకు ఉండాల్సిన టీయారెస్ ప్రెసిడెంట్లు ముప్పయి మూడు దాకా పెరిగారు. అలా పార్టీ రాజకీయ బలం పెంచుకుంది. అదే టైమ్ లో ఇంతమంది ప్రెసిడెంట్లు అయ్యాక అంతా పార్టీకి దళంగానే ఉంటున్నారు తప్ప మహా నేతలుగా మారి భారీ గొంతులు అయితే వినిపించడంలేదు, కనిపించడంలేదు అన్న ప్రచారం జరిగింది.
ఇప్పటికి ఆరేళ్ళు అయింది తెలంగాణాలో కొత్త జిల్లాలు వచ్చి. అక్కడ జరిగింది కేవలం రాజకీయ విభజన, వికేంద్రీకరణ. ఫలితంగా అధినాయకత్వం పవర్ ఫుల్ అయింది తప్ప అంతకు మించి పరిపాలనాపరంగా జనాలకు పెద్ద తేడా లేదని నివేదికలు ఉన్నాయి. ఇపుడు అదే తంతు ఏపీలో కూడా సాగుతుందా అంటే ఏమో చెప్పలేము, అలాగే జరగవచ్చు అనే అంటున్నారు.
ఎందుకంటే అధినాయకుడు అనదగిన ముఖ్యామంత్రి కానీ రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కి కానీ అధికారిక బౌగోళిక బౌండరీస్ లో ఏ మార్పులూ లేవు. తరువాత నాయకులు, మిగిలిన లీడర్లే ఒకదాన్ని ఇద్దరు ముగ్గురుగా పంచుకోవాలి. ఒక విధంగా బలహీనమైన నాయకులు, బలమైన అధినాయకుడుగా అవతరించడానికే ఈ వికేంద్రీకరణ అన్నది మేధావుల మాట. మరి రాజకీయ బలవంతుల కోసమే ఈ కొత్త జిల్లాలు అయితే మాత్రం జనాలు వీటి నుంచి పెద్దగా ఆశించడానికి కూడా ఏమీ ఉండకపోవచ్చు అన్నది ఒక విశ్లేషణ.