తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలపై తాజాగా మరో లెక్క తెర మీదకు వచ్చింది. పాతిక అని ఒకసారి కాదు ముప్ఫై అంటూ మరోసారి.. ఇవేమీ కాదు.. 26కు ఓకే అన్నారన్న అంచనాలతో కూడిన వార్తలు వచ్చాయి. అయితే.. వీటికి సంబంధం లేకుండా తాజాగా మరో లెక్క తెర మీదకు వచ్చింది. అదే దాదాపు ఫైనల్ అన్న మాట కూడా చెబుతున్నారు. ఇంతకాలం పచ్చీస్ తెలంగాణ అంటూ పాడిన పాటకు భిన్నంగా కొత్త జిల్లాల లెక్క వినిపిస్తోంది.
సోమవారం సీఎం రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో జిల్లాల కలెక్టర్ల సమావేశంలో కొత్త జిల్లాలు 14 అన్న ప్రతిపాదనకు ఓకే చేశారు. తొలుత 23కే పరిమితమైనా.. ముఖ్యమంత్రి సూచించిన సిరిసిల్ల జిల్లాను కలవటంతో మొత్తం జిల్లాలు 24గా డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తుది ముసాయిదాను సిద్దం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు.. అందుకు అవసరమైన సిబ్బంది.. మౌలిక సదుపాయాలు.. మండలాల కూర్పు లాంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
కొత్త జిల్లాల లెక్క తేలిపోవటంతో.. ఇక వాటిల్లో చేర్చాలని మండలాలు.. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన మండలాలపై చర్చ జరగ్గా.. ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్త మండలాల ఏర్పాటు భారీగా చేపట్టాలన్న దానికి భిన్నంగా.. అవసరమైన మేరకు మాత్రమే కొత్త మండలాలు ఏర్పాటు ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తాజాగా జరిగిన సమావేశం స్పష్టం చేసిందని చెప్పాలి.
ఇక.. కొత్త జిల్లాలకు అవసరమైన సిబ్బంది విషయంలోనూ ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలకు అవసరమైన సిబ్బందిని ఇవ్వలేమని.. కొత్త జిల్లాలుగా ఏర్పడిన జిల్లాలోని సిబ్బందినే సర్దుబాటు చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. మరీ.. అవసరం అనుకుంటే.. పెద్దగా పని లేని శాఖలకు చెందిన వారిని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాను కూడా కలెక్టర్లు వేశారు. వారి లెక్కల ప్రకారం ఒక్కో జిల్లా ఏర్పాటుకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు అవసరం అవుతుందని.. కొత్త జిల్లాకు 1100 నుంచి 1300 మంది ఉద్యోగులు అవసరమని లెక్క తేల్చారు.
ఇక.. కొత్త జిల్లాలకు అవసరమైన కార్యాలయాల విషయానికి వస్తే.. డివిజన్ స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ బంగ్లాలనే జిల్లా కార్యాలయాలుగా మార్చుకోవాలని.. ఒకవేళ అవి సరిపోవని భావిస్తే అద్దె భవనాలు ఏర్పాటు చేసుకోవాలన్న సూచన వచ్చింది. ఇక.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా ఫైళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా తయారు చేసిన ముసాయిదా ప్రకారం 24 జిల్లాలు ఏవంటే..
ఇప్పుడున్న జిల్లాలు తుది ముసాయిదాలో పేర్కొన్న కొత్త జిల్లాలు
అదిలాబాద్ కొమరం భీం
నిజామాబాద్ కామారెడ్డి
కరీంనగర్ జగిత్యాల - సిరిసిల్ల
మెదక్ సంగారెడ్డి.. సిద్ధిపేట
హైదరాబాద్ సికింద్రాబాద్
రంగారెడ్డి -
మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ - వనపర్తి
వరంగల్ భూపాలపల్లి - మహబూబాబాద్
నల్గొండ యాదాద్రి - సూర్యాపేట
ఖమ్మం కొత్తగూడెం