కొత్త జిల్లాలు : నేడే ఉషోదయం నేడే నవోదయం పాడవోయి న‌వ్యాంధ్ర పౌరుడా !

Update: 2022-04-04 04:27 GMT
నేడే ఉషోద‌యం నేడే న‌వోద‌యం అని పాడుకోవాలి ప్ర‌తి ఒక్క న‌వ్యాంధ్ర పౌరుడు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మ‌రికొద్దిసేప‌ట్లో ముహూర్తం ఆగ‌మం అయి ఉంది. ఈ ఆగమం వేళ  అభిలాష ఏంట‌న్న‌ది కూడా వెత‌కాలి. అర్థం కూడి భాష్యం చెప్పాలి. ఆ విధంగా మ‌న పాల‌కుల మ‌న‌సుల్లో ఉన్న‌ది ప్ర‌జ‌ల ప్ర‌తిపాదిత స్వ‌రాల్లో ఉన్న‌ది ఒక్క‌టో కాదో పోల్చి చూడాలి. తేల్చి చెప్పాలి.ఆ విధంగా ఇవాళ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనే యువ ముఖ్య‌మంత్రి ముందుకు పోతున్నారు. పాల‌నాలో సంస్క‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తూ, ఆ దిశాలో యంత్రాంగాన్ని నిర్దేశిస్తూ, వ‌డివ‌డిగా అడుగులు వేస్తూ కొత్త జిల్లాల ఏర్పాటుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మూడు పాల‌నా సంస్క‌ర‌ణలు గురించి చెబుతున్నారు.

ఒక‌టి గ్రామ స‌చివాల‌యాల ఏర్పాటు అదే స‌మ‌యాన ప‌ట్ట‌ణాల్లో అయితే వార్డు స‌చివాల‌యాల ఏర్పాటు. ఇదొక విప్ల‌వాత్మ‌క మార్పు అని పాల‌నను మ‌రింత స్థానికం చేసేందుకు, స్థానిక సుప‌రిపాల‌న‌కు అర్థం చెప్పేందుకు తాము చేసిన గొప్ప ప్ర‌య‌త్నం అని వైఎస్ జ‌గ‌న్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్ప‌న కూడా సాధ్యం అయింద‌ని, ల‌క్ష‌కు  పైగా స‌చివాలయాల్లో వివిధ పోస్టుల‌లో కొలువుదీరార‌ని, త్వ‌ర‌లోనే వారిని రెగ్యుల‌రైజ్ చేస్తామ‌ని కూడా చెబుతున్నారు. జూన్లో పోస్టుల రెగ్యుల‌రైజేష‌న్ కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని కూడా అంటున్నారీయ‌న. మ‌రో విష‌యం ఏంటంటే వ‌లంటీర్లుగా తీసుకున్న‌వారికి కూడా సేవా మిత్ర, సేవా ర‌త్న, సేవా వ‌జ్ర  పేరిట అవార్డులు కూడా అంటున్నారు.

ఇక రెండో సంస్క‌ర‌ణ కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇవాళ ముహూర్తాన్ని నిర్ణ‌యించామ‌ని ఉద‌యం తొమ్మిది గంట‌ల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంట‌ల 45 నిమిషాల మ‌ధ్య‌లో సంబంధిత ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని జిల్లా యంత్రాంగాల‌ను ఆదేశించామ‌ని సీఎం అంటున్నారు.ఇదే స్ఫూర్తితో మూడు రాజ‌ధానుల నిర్మాణంతో స‌మానాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నామ‌ని ఇదే రేప‌టి వేళ త‌మ అభిమతం అని అంటున్నారాయ‌న.
Tags:    

Similar News