కొత్త జిల్లాలకు ముహూర్తం

Update: 2022-03-30 11:30 GMT
మరో నాలుగు రోజుల్లో ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. పదమూడు నుంచి ఇరవై ఆరు దాకా జిల్లాలు రానున్నాయి. దీని మీద  ఉన్నత స్థాయి సమీక్షను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారని చెబుతున్నారు. ఇక  ఏప్రిల్ 4వ తేదీ . ఏప్రిల్ 4న ఉదయం 9:05 గంటల నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం పెట్టుకున్నారు. ఆ ముహూర్తాన కొత్త జిల్లాలను ప్రారంభిస్తారు.

దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం నుంచి వెళ్ళాయని అంటున్నారు. మరోవైపు చూస్తే కొత్త జిల్లాలకు వర్చువల్ గా సమావేశమైన  మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇరవై ఆరు జిల్లాలుగా ఏపీని విభజిస్తున్నారు. అదే విధంగా కొత్తగా మరో 22 రెవిన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన వినతులు, ఫిర్యాదులు పదకొండు వేలు పై దాటి ఉన్నాయి. అందులో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన జిల్లాలు కూడా ఉన్నాయి.

మరి వాటి మీద ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంది అన్నది తెలియడం లేదు. అయితే రాజకీయ డిమాండ్లతో పాటు ప్రజల నుంచి వచ్చిన వాటిని జాగ్రత్తగా పరిశీలించి వీలైనంత వరకూ సానుకూల నిర్ణయం తీసుకున్నారని  అంటున్నారు.

ఇంకో వైపు కొత్త జిల్లాలు అనగానే కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసుల కోసం భవనాలను కూడా ఎంపిక చేయడం పూర్తి అయింది అంటున్నారు. అదే విధంగా విశాఖ జిల్లాలోని అల్లూరు సీతారామరాజు జిల్లాకు పాడేరు ఐటీడీఏ భవనం  కొత్త కలెక్టరేట్ గా ఉంటుంది. మన్యం జిల్లాకు పార్వతీపురంలోని ఐటీడీఏ బిల్డింగ్ ని తీసుకున్నారు. విజయవాడ జిల్లాకు సబ్ కలెక్టర్ ఆఫీస్ ని వినియోగిస్తారు. బాపట్ల జిల్లాకు మానవ వనరుల అభివృద్ధి కేంద్రం భవనం కలెక్టరేట్ అవుతుంది.

మొత్తానికి ఉగాది నుంచి కొత్త జిల్లాలు అని ఇప్పటిదాకా  అన్నారు. కానీ మరో రెండు రోజుల తరువాత మంచి ముహూర్తం చూసుకుని మరీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఏపీ జిల్లా స్వరూప స్వభావాలు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News