కాంగోలో మ‌ళ్లీ ఎబోలా.‌. ఇక రెండు వైర‌స్‌ల విజృంభ‌ణ‌

Update: 2020-06-02 11:10 GMT
ప్రపంచమంతా అస‌లే మ‌హ‌మ్మారి వైరస్‌తో పోరాడుతోంది. ప్ర‌స్తుతం ఇప్పుడు కాలం మారింది. ఈ కాలంలో గ‌తంలోనే విజృంభించిన ఎబొలా వైరస్ మ‌ళ్లీ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఆ రెండు వైర‌స్‌లు ఇప్పుడు మ‌ళ్లీ దాడి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. తమ దేశంలో ఎబోలా వైరస్ కొత్తగా వ్యాపిస్తున్నట్టు కాంగో సోమవారం ప్ర‌క‌టించింది. ఈక్వెటార్ ప్రావిన్సుల్లోని వాంగటా, ఎంబడకాలో ఎబోలా వైర‌స్ కేసులు వెలుగులోకి వ‌చ్చిన‌ట్టు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.

తూర్పు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైర‌స్ వ్యాప్తి గ‌తంలోనే ఉంది. ఇప్పుడు ప్ర‌పంచంతోపాటు కాంగోలో కూడా ప్ర‌స్తుత వైర‌స్ కూడా ప్ర‌బ‌లుతోంది. కాంగోలోని వంగటాలో ఇప్పటివరకు ఆరు ఎబోలా కేసులు నమోదయ్యాయి. వారిలో నలుగురు మృత్యువాత ప‌డ్డారు. అయితే ఈ వైర‌స్ నిర్ధారణ పరీక్షలు పెంచుతూ వెళ్తుంటే మ‌రికొన్ని కేసులు వెలుగులోకి వ‌స్తోంద‌ని ఆ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎక్కువ మందిలో వైరస్ నిర్ధారణ అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది.

ప్ర‌స్తుతం రెండు వైర‌స్ ప‌ట్ల అప్రమ‌‌త్తంగా ఉండాల‌ని, ఇది ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య అని, దీనిపై మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘోబ్రియోసిస్ తెలిపారు.

తొలిసారిగా కాంగోలో 1976లో ఎబోలా వైరస్ వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు రావ‌డం 11వసారి. జూలై 2018లో వంగాటాలో ఎబోలా వ్యాపించిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఎబోలా వ్యాప్తిపై ఆఫ్రికా ప్రాంతీయ విభాగం డైరెక్టర్ డాక్టర్ మాట్స్‌హిడిసో మెయిటీ స్పందిస్తూ.. రెండేళ్లుగా ఆరోగ్య వ్యవస్థలు, ఆఫ్రికా సీడీసీ, ఇతర భాగస్వాములతో కలిసి డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తోందని తెలిపారు. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, డబ్ల్యూహెచ్ ప్రతిస్పందనను పెంచడానికి ఒక బృందాన్ని పంపాలని యోచిస్తోందని చెప్పారు. రవాణా మార్గాల ద్వారా పొరుగు దేశాలకు ఈ కొత్త వ్యాప్తి చెందే అవవకాశం ఉండ‌డంతో త్వరగా మేల్కోవాల‌ని సూచించారు.
Tags:    

Similar News