రాష్ట్రంలో అతిపెద్ద ప్రజారవాణాగా ఉన్న ఆర్టీసీని మెరుగు పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా 350 బస్సులను రాష్ట్రానికి తీసుకు రాబోతోంది. అయితే.. అవన్నీ ఎలక్ట్రిక్ బస్సులు కావడం గమనార్హం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా.. ప్రపంచం కాలుష్య రహిత వాహనాల వైపు మొగ్గుచూపుతున్న వేళ.. ఏపీ సర్కారు కూడా ఎలక్ట్రికల్ బస్సులను దిగుమతి చేసుకోబోతుండడం విశేషం.
ఈ బస్సుల్లో విశాఖ పట్నానికి 100 కేటాయించగా.. విజయవాడ, తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్డు, కాకినాడ, అమరావతి నగరాలకు 50 చొప్పున కేటాయించింది. త్వరలోనే ఈ బస్సులు ఏపీ రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి.
కాగా.. ఈ బస్సులతో ఆర్టీసీకి నిర్వహణ వ్యయం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. బ్యాటరీ ధరలు 50 శాతం మేర తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ బస్సుల కొనుగోలుకు ప్రోత్సాహకం రూపంలో రూ.55 లక్షలు అందనున్నాయి. ఈ విధంగా ఆర్టీసీకి రెండు వైపులా మేలు జరుగుతుందన్ని అంటున్నారు.
కాగా.. గతంలోనే ఈ బస్సులను దిగుమతి చేసుకోవాలని భావించినప్పటికీ.. పలు అభ్యంతరాలు రావడంతో నిర్ణయం వెనక్కు తీసుకుంది. ఇప్పుడు నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుండడంతో ఎలక్ట్రిక్ బస్సుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.