బ్యూటీషియన్ శిరీష్ ఆత్మహత్య కేసు సినిమా థ్రిల్లర్‌ను మించి రోజుకో కొత్త మిస్టరీ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే శిరీష సన్నిహితంగా మెలగిన రాజీవ్‌ను కాదని... సాయం పేరిట ఆమెను కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లిన శ్రవణ్ ను పోలీసులు ఏ1 నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయినా శిరీషతో వివాహేతర సంబంధం నెరపిన రాజీవ్ ను కాదని - శిరీషపై అత్యాచార యత్నం చేసిన ప్రభాకర్ రెడ్డిని కాదని శ్రవణ్ ను ఏ1 నిందితుడిగా ఎందుకు పేర్కొన్నారన్న అంశం రెండు రోజుల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు గల కారణాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడంతో ఆ సస్పెన్స్ వీడిపోయింది.
తాజాగా వెలుగుచూసిన మిస్టరీ విషయంలోకి వెళితే... శిరీషపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు కొత్త అనుమానాలను రేకెత్తించారు. ఈ దిశగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేయడానికి కారణాలు కూడా లేకపోలేదు. శిరీష్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సమయంలో ఆమె ధరించిన లోదుస్తులపై మరకలు ఉన్నాయట. ఈ మరకల ఆధారంగానే ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సదరు మకరలు దేని కారణంగా ఏర్పడ్డాయన్న విషయంపై పోలీసులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. ఎందుకంటే సదరు మరకలు అత్యాచారం జరిగిన ఆనవాళ్లా? లేదంటే మరే కారణంతోనైనా ఆ మరకలు పడ్డాయా? అన్న విషయాన్ని తేల్చాల్సిన ఫోరెన్సిక్ నిపుణులు ఇంకా ఈ కేసులోకి దిగలేదు.
అయితే శిరీష్ మరణించిన సమయంలో ధరించిన దుస్తులను భద్రపరచిన పోలీసులు వాటిని త్వరలోనే ఫోరెన్సిక్ నిపుణులకు అందజేయనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ విచారణలోనే సదరు మరకలు ఏ కారణంగా ఏర్పడ్డాయన్న విషయం తేలనుంది. అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల కథనం మేరకు సదరు మరకలు అత్యాచారం కారణంగానే ఏర్పడ్డాయని తెలుస్తోంది. అంటే... సాయం కోసం కుకునూరుపల్లి వెళ్లిన శిరీషపై ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేసే ఉంటారన్న దిశగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనలో ఈ విషయం నేడో, రేపో తేటతెల్లం కానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/