మద్యం రక్కసి బారిన పది ఏటా కొన్ని వేల కుటుంబాలు అనాథలుగా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మద్యాన్ని నిషేధిస్తామని లేదా నియంత్రిస్తామని నాయకులు అనేక రూపాల్లో ప్రజలకు హామీలు గుప్పిస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో మద్యాన్నితాను నియంత్రిస్తానని, అక్కా చెల్లెమ్మల కన్నీరు తుడుస్తానని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ తాను అధికారంలోకి వచ్చిన రెండు మాసాల్లోనే దీనిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా.. సాధ్యం కాదంటూ.. జనసేన నాయకుడు పవన్ వంటివారు ఎద్దేవా చేసినా.. ఆయన ముందుకు వెళ్తున్నారు.
అంతేకాదు, అసలే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యాన్ని నిలిపివేయడం ద్వారా మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అధికారుల మాటలను కూడా బుట్టదాఖలు చేసిన జగన్.. మద్యం నిలిపేతకే తన ప్రబుత్వం కట్టుబడి ఉందని సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే అక్టోబరు 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అమలు చేయాలనినిర్ణయించారు. దీనికి తగిన విధంగా జగన్ ఆశయాలకు అనుగుణంగా తాజాగా అధికారులు కొత్త మద్యం పాలసీని ప్రకటించారు.
దీనిప్రకారం.. రాష్ట్రంలో మద్యం నియంత్రణ మొత్తం ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోనుంది. పలితంగా బెల్టు షాపు కనిపించే ఆస్కారం లేదని ఈ రంగంలోని నిపుణులు, అధికారులు సైతం చెబుతున్నారు. ఇక, ప్రభుత్వ పాలసీ ప్రకారం.. ఇప్పుడున్న దుకాణాల్లో 20.09% దుకాణాలను తగ్గించుకుంటారు. అంటే నాలుగు వేల పైచిలుకు ఉన్న ప్రస్తుత దుకాణాలు 3500 కు తగ్గిపోనున్నాయి. అదేసమయంలో సమయాన్ని కుదించనున్నారు. ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు ఉండే మద్య దుకాణాలు అక్టోబరు నుంచి ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో సాగడంతోపాటు ఉదయం 10 నుంచి రాత్రి తొమ్మిది వరకే ఉంటాయి.
అదే సమయంలో పర్మిట్ రూమ్ లకు స్వస్థి పలికారు. అంటే, అక్కడికక్కడే తాగే అవకాశం ఇక, మందుబాబులకు ఉండదు. ఫలితంగా గణనీయంగా మార్పు వస్తుందని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో మందుతాగే వారి జేబులు గుల్లకాకుండా ఎంఆర్ పీ ధరలకే విక్రయించేలా కూడా నిర్ణయాలు తీసుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో మహిళల కన్నీళ్లు కొంత వరకైనా తగ్గుతాయని అంటున్నారు పరిశీలకులు మరి ఏం జరుగుతుందో ? చూడాలి.