కేంద్ర కేబినెట్లో కొత్త ముఖాలు?

Update: 2021-06-14 16:30 GMT
ప్రధాని నరేంద్రమోడీ త్వరలోనే కేబినెట్ ను పునర్వ్యస్థీకరించాలని సమీక్షలు నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదంతా పనిచేయని కేంద్రమంత్రులను సాగనంపి.. పనిచేస్తున్న వారికి చోటు ఇవ్వాలనే అని ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఈ క్రమంలోనే త్వరలో కేంద్రకేబినెట్ విస్తరణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని పలు శాఖలపై సమీక్షలు జరపడంతోపాటు యూపీ, గుజరాత్ లో ఎన్నికలు జరుగనుండడంతో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చేలా మార్పులు ఉంటాయని సమాచారం.

ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు మధ్యప్రదేశ్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

ప్రధాని మోడీ రెండేళ్ల పాలనలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. వచ్చే మూడేళ్లలోనే పాలనను పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యారు. అందుకే పూర్తిగా యువకులు, పనిచేసే వారికే ఈసారి చోటు లభించనుందని.. భారీ ప్రక్షాళన ఉంటుందని సమాచారం.
Tags:    

Similar News