ఆ జాబితా నుంచి కొవిషీల్డ్ అవుట్.. యూరప్ కు వెళ్లే వారికి ఇబ్బందే

Update: 2021-06-29 06:30 GMT
కొవిషీల్డ్ కు కొత్త కష్టం వచ్చి పడింది. కరోనా వేళ.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే.. ఆయా దేశాలకు అనుగుణంగా టీకా పాలసీని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటివి కొవిషీల్డ్ అయితే.. రెండో కొవాగ్జిన్. మూడోది రష్యాకు చెందిన స్పుత్నిక్. అయితే.. ఈ మూడింటిలో స్పుత్నిక్ చాలా తక్కువ చోట్ల.. అది కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లోనే వేస్తున్నారు.

కరోనా వేళ తమ దేశాలకు వచ్చే పర్యాటకులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ పాస్ పేరుతో ఉన్న అర్హత చాలా అవసరం. ఇదిలా ఉంటే.. తాజాగా ఇలా యూరోపియన్ దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఎవరు కూడా కొవిషీల్డ్ వేయించుకోకూడదు. ఒకవేళ.. కొవిషీల్డ్ వేసుకున్నా.. వారిని ఆయా దేశాల్లో పర్యటించేందుకు అనుమతి లభించని పరిస్థితి.

తాజాగా యూరోపియన్ యూనియన్ జారీ చేసిన జాబితాలో కొవిషీల్ద్ పేరును తొలగించారు. దీంతో.. ఐరోపా దేశాలకు వెళ్లే  వారు కొవిషీల్డ్వేయించుకొని ఉంటే.. వారికి కొత్త సమస్య ఎదురైనట్లే. ఈ అంశంపై కొవిషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇన్ స్టిట్యూ్ ట్ అధినేత ఆదార్ పైనావాలా స్పందించారు. ఈ సమ్యను అత్యున్నత స్థాయి వర్గం దృష్టికి తీసుకెళ్లానని.. త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతవరకు యూరోపియన్ దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసే వారి సంగతేమిటి? అన్నదిప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్. మొన్నటిదాకా ఓకే చేసి ఇప్పుడు నో చెప్పటం ఏమిటి?
Tags:    

Similar News