భార‌తీయ మ‌హిళపై జాత్య‌హంకార వ్యాఖ్య‌లు

Update: 2017-06-09 10:18 GMT
ట్రంప్ అధ్యక్షుడ‌య్యాక‌  అమెరికాలో లోక‌ల్ సెంటిమెంట్ బాగా బ‌ల‌ప‌డింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొంద‌రు భార‌తీయుల‌పై దాడులు జరిగాయి. తాజాగా...అమెరికాలో ప‌నిచేస్తున్న భార‌తీయ ఉద్యోగినిపై  ఓ అమెరిక‌న్ మ‌హిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. అమెరిక‌న్ల‌ను భార‌తీయ ఉద్యోగులు త‌మ వెనుక నిల‌బెట్టుకుంటున్నారంటూ...పెద్దగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

స‌ద‌రు అమెరిక‌న్ మ‌హిళ న్యూజెర్సీలోని ఒక డిపార్ట్‌ మెంట్‌ స్టోర్‌ లో క్యాష్‌ కౌంటర్ వద్ద క్యూలో నిలబడింది. అక్క‌డ ఉన్న ఒకే కౌంటర్ వ‌ద్ద‌ క్యూ రద్దీగా ఉండటంతో ఆమె అసహనానికి లోనైంది. ఆ కోపాన్నంతా క్యాష్ కౌంటర్ లో ప‌ని చేస్తున్న భారతీయ ఉద్యోగినిపై వెళ్ల‌గ‌క్కింది. భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకుని, మమ్మల్ని వారి వెనకాల నిలబెడుతున్నారంటూ మండిపడింది. మీరు మీ దేశానికి వెళ్లిపో... అంటూ భార‌తీయ ఉద్యోగినిపై కేక‌లు వేసింది.

సిమోని లొనావో(27) అనే వ్యక్తి ఈ త‌తంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆమె కోపానికిఅస‌లు కార‌ణం వేరే ఉంది. క్యూలో ఆమె ముందు ఓ లాటిన్ కుటుంబం నిలుచుని ఉంది. వారి వద్ద ఉన్న ఓచర్లు క్లియర్ చేయడానికి భార‌తీయ ఉద్యోగినికి 20ని. పైగా సమయం పట్టింది.ఈ విష‌యం తెలియ‌కుండా ఆ అమెరిక‌న్ మ‌హిళ‌ త‌న ముందు నిలుచున్న‌ది భార‌తీయ కుటుంబ కాబ‌ట్టే క్యాషియ‌ర్ అంత ప్రాధాన్యం ఇస్తోంద‌ని భావించింది. అంతసేపు క్యూలో నిల్చోలేక అసహనంతో నోరు పారేసుకుందని  చెబుతున్నారు

ఏదేమైనా....అమెరికాలో ఉద్యోగాలు అమెరిక‌న్ల‌కే అన్న ట్రంప్ నినాదం కొంద‌రు స్థానికులకు ఊతమిచ్చిన‌ట్ల‌యింది. విదేశీయుల వల్లే తాము ఉద్యోగాలు కోల్పోతున్నామ‌ని చాలా మంది అమెరిక‌న్లు భావిస్తున్నారు. దీంతో వారు  ఇతర దేశస్థుల‌ను తీవ్రంగా ద్వేషించడం మొదలుపెట్టారు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News