రాజకీయాలు చేసుకోవటానికి బోలెడన్ని ప్లేసులు ఉన్నాయి. వేదికలు ఉన్నాయి. వాటిని వదిలేసి.. అధ్యాత్మిక కార్యక్రమాలకు నెలువుగా ఉండే దేవాలయాలు.. దేవాలయాలకు అనుబంధంగా ఉండే ప్రాంతాల్లో కార్యకలాపాలు చేపట్టిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
అమరావతి రాజధానిగా చేపట్టాలంటూ చేస్తున్న పోరాటాలకు భిన్నంగా ఇటీవల కాలంలో మూడు రాజధానులకు మద్దతుగా కొత్త రాజకీయానికి తెర తీస్తోంది అధికార పార్టీ. తాజాగా తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేర్కొనే శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉండే నారద పుష్కరిణి వద్ద వైసీపీకి చెందిన వారు నిర్వహించిన సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వికేంద్రీకరణకు మా మద్దతు అంటూ.. మూడు రాజధానులకు అనుకూలంగా తాము తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికేందుకు వీలుగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వైసీపీకి చెందిన పార్టీ జెండా రంగు అయిన నీలం బెలూన్లు.. చెట్లకు జెండాలు కట్టటం చర్చకు తెర తీసింది.
ఇలా అధ్యాత్మిక వేదికల మీద రాజకీయ సమావేశాన్ని నిర్వహించటమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రావటం.. మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కొత్త రచ్చకు తెర తీస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.
ఈ పుష్కరిణిలో ప్రతి ఏటా మహాశివరాత్రి వేళ వార్షిక బ్రహ్మోత్సవాలు.. దేవతామూర్తులతో తెప్పోత్సవాల్ని నిర్వహించటంతో పాటు కార్తిక పౌర్ణమి వేళలోనూ దీపోత్సవాల్ని నిర్వహిస్తుంటారు. అలాంటి చోట్ల ఇలా రాజకీయ సమావేశాన్ని ఏర్పాటు చేయటమా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకవైపు.. రాజధానుల లొల్లి వేళ కోర్టులు చేస్తున్న వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా చేస్తున్న ఈ తరహా రాజకీయ సమావేశాలు కొత్త రచ్చకు తెర తీస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.