తెలంగాణ రాష్ట్రానికి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంకాకు సంబంధమే లేదు. కానీ.. ఇప్పుడు ఇవాంకా పుణ్యమా అని తెలంగాణ సర్కారుకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ నెలాఖరులో జరగనున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీలో జరగనుంది. మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడి సలహాదారు హోదాలో ఆమె పాల్గొనన్నారు. పేరుకు అమెరికా అధ్యక్షుడి సలహాదారుకంటే కూడా ఆయన కుమార్తెగా ఇచ్చే విలువ అంతా ఇంతా ఉండదు కదా.
అందుకే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు అలెర్ట్ అయిపోయింది. ఇవాంకా లాంటి పెద్ద మనిషి హైదరాబాద్ రోడ్ల మీద తిరిగే ఆమెకెంత ఇబ్బందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమె రూట్ ప్లాన్ ను సిద్ధం చేసిన పోలీసులు.. ఆమె ప్రయాణించే రోడ్లను సుందరీకరణ చేసే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు.
ఇప్పటికే పనులు మొదలెట్టిన జీహెచ్ ఎంపీ వేగంగా పనులు పూర్తి చేస్తోంది. నిగనిగలాడే రోడ్లు ఒకపక్క.. మరోవైపు పుట్ పాత్ లు.. పూలకుండీలు.. ఇలా ఆమె ప్రయాణించే మార్గం మొత్తం సినిమా సెట్టింగ్‌ను తలపించేలా తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు పత్రికల్లో వస్తున్నాయి.
అదే సమయంలో.. సామాన్యుడు ప్రయాణించే రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్న నేపథ్యంలో ఆ రోడ్ల ముచ్చటను తెర మీదకు తీసుకొచ్చి కేసీఆర్ సర్కారును ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ఇంగ్లిషు మీడియా సంస్థలు మొదలెట్టాయి. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ కానుంది.
ఇంగ్లిషులో మీడియాలో భారీగా వచ్చే కథనాలు అంతో ఇంతో తెలుగు మీడియాను ప్రభావితం చేస్తాయని చెప్పక తప్పదు. అదే జరిగితే.. కేసీఆర్ సర్కారు ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ కాక తప్పదు. ఇప్పటివరకూ కేసీఆర్ సర్కారుకు వ్యతిరేక కథనాలు రాసే విషయంలో తెలుగు మీడియా సంస్థలన్నీ ఆచూతూచి వ్యవహరిస్తున్నాయన్న మాట బలంగా ప్రచారంలో ఉంది. అలాంటిది కాస్తా.. ఇప్పుడు ఇవాంకా పేరుతో కేసీఆర్ సర్కారు పని తీరు.. రోడ్ల విషయలో ప్రభుత్వ ఫెయిల్యూర్ ను ఎత్తిచూపేలా కథనాల మీద కథనాలు వస్తే వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది.
మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు కానీ.. ఇవాంకా ప్రయాణించే రోడ్డు మార్గాల్లో రహదారులు బాగు చేయటం కోసం రూ.50కోట్లకు పైనే నిధుల్ని యుద్ధప్రాతిపదిక మీద వసూలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
లక్షలాది హైదరాబాదీయులు నిత్యం రోడ్ల కారణంగా నరకం చూస్తుంటే పట్టని తెలంగాణ ప్రభుత్వానికి.. అక్కడెక్కడ నుంచో వస్తున్న ఇవాంకా కోసం ఇంత భారీగా ఏర్పాట్లు చేయటంపై సోషల్ మీడియాలో వేడి మొదలైతే జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుంది. ఇవాంకాకు ఏర్పాట్లు చేయమని చెప్పురు కానీ.. అదే సమయంలో సామాన్యుడి సమస్యల గురించి సర్కారు ఎందుకు స్పందించదన్న ప్రశ్నకు ఆత్మరక్షణలో పడక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.