కొత్త రూ.250 నోటు వ‌స్తోంది!!

Update: 2016-12-13 05:36 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత వ‌స్తున్న రోజుకో వార్త ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం చూపించాల్సింది పోయి...మ‌రింత గంద‌ర‌గోళం క‌లిగించే స్థాయికి చేరుతోంది. ఇప్ప‌టికే రూ.100 - రూ.2000 నోట్ల‌ను పొందేందుకు సామాన్యులు అవ‌స్థ‌లు ప‌డుతుంటే...ఇపుడు వ‌చ్చిన వార్త మ‌రింత షాక్ క‌లిగించేది ఉంది. త్వరలో రూ.2వేల నోటు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ ఎస్‌ ఎస్) సిద్ధాంతకర్త - ఆర్థిక నిపుణుడు ఎస్ గురుమూర్తి తెలిపారు. చిన్ననోట్లతో పాటు పెద్ద నోటు కూడా రద్దు అయ్యే అవకాశం ఉందన్నారు.

రూ. 200 నోట్ల ర‌ద్దు రానున్న ఐదేళ్ల‌లో ఇది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని గురుమూర్తి స్పష్టం చేశారు. అప్పుడు దేశంలో రూ. 500 నోటే అతి పెద్ద నోటుగా చెలామణి అవుతుందని జోస్యం చెప్పారు. కొత్తగా రూ. 250 నోటు - రూ. 100 నోటును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇక వెయ్యి నోటు అయితే శాశ్వతంగా రద్దు కానుందని గురుమూర్తి తెలిపారు. నల్లధనం - అవినీతిని నిర్మూలించేందుకే ప్రధాని మోదీ గత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేశారని పేర్కొన్నారు. అయితే నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తూ... ప్రధాని తప్పుడు నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపిస్తుండ‌టం స‌రికాద‌ని గురుమూర్తి అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2వేల నోటుతో అవినీతి - బ్లాక్‌ మనీ మరింత పెరిగిపోతుందని అంటుండ‌టాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ప్ర‌స్తుత ఆర్థిక అవ‌స‌రాలు తీర్చేందుకే రూ.2000 నోటు తీసుకువ‌చ్చార‌ని త్వ‌ర‌లో వాటిని ర‌ద్దు చేయ‌బోతున్నార‌ని గురుమూర్తి వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News