ఆంధ్రప్రదేశ్ లోని విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా, ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్ధులకు మెరుగైన విద్యను అందించేందుకు పునాదులు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా చాలా పథకాల్ని తీసుకువచ్చింది. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయడమే గాక విద్యార్థుల కోరిక మేరకు నగదు లేదా ల్యాప్ టాప్ అందిస్తోంది ప్రభుత్వం. అదేవిధంగా జగనన్న గోరుముద్ద ద్వారా రోజూ మెనూ మార్చి రుచికరమైన, నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందిస్తోంది.
ఇక రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి ఏపీలో బడులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా చాలా గ్యాప్ రావడంతో , ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు బడికి వెళ్లడం లేదు. దీనితో విద్యార్థి క్షేమ సమాచారాలు తెలుసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులను పర్యవేక్షించేందుకు హెడ్ మాస్టర్లతో పాటు కొత్తగా వలంటీర్లకు బాధ్యతలు అప్పగించింది. దీనికోసం రోజూ విద్యార్థి హాజరును నమోదు చేసేందుకు ‘స్టూడెంట్ అటెండెన్స్ యాప్’ను ప్రవేశపెట్టింది.
ఈ యాప్ లో విద్యార్థి హాజరును రోజూ నమోదు చేస్తారు. ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థుల హాజరు వివరాలు డీఈఓ కార్యాలయానికి చేరతాయి. విద్యార్థులు పాఠశాలకు హాజరై.. అభ్యసన ప్రక్రియలో పాల్గొంటున్నారా , లేదా అని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థి అయినా వరుసగా మూడు రోజులు పాఠశాలకు వెళ్లకపోతే, విద్యార్థి ఉంటున్న ప్రాంతంలోని వలంటీరుకు సమాచారం వెళ్తుంది. దీనితో వాలంటీర్ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి సమాచారం అందిస్తారు.
అలా కాకుండా ఇతర కారణాలతో పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారంఅందిస్తారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే హాజరు నమోదుపై దృష్టి పెట్టేవారు. ఇక నుంచి ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు కూడా విద్యార్థుల హాజరును స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏడాదిలో 70 శాతం హాజరు లేకపోతే అమ్మఒడి పథకం కూడా వర్తించదని తేల్చిచెప్పింది. దీంతో ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల హాజరును తప్పకుండా యాప్‌లో నమోదు చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఇకపై స్కూల్స్ కి తప్పనిసరిగా హాజరు కావాల్సిందే.