ట్రైన్ జర్నీ చేసేవారికి గుడ్ న్యూస్.. ఈ సరికొత్త సేవల్ని ఇలా అందుకోవచ్చు!
భారత రైల్వే వారు సరికొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రైన్ జర్నీ చేసే వారు తరచూ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య.. తెల్లవారుజామున తమ గమ్యస్థానాల్ని చేరాలనుకునే వారు.. అర్థరాత్రి దాటిన తర్వాత తాము దిగాల్సిన రైల్వే స్టేషన్ వచ్చే వేళలో.. ఆ స్టేషన్ వచ్చే సమయానికి గంట.. రెండు గంటల ముందు లేచి.. టెన్షన్ గా ఎదురుచూస్తుంటారు.
ఇలాంటి సమస్యకు తాజాగా పరిష్కారాన్ని చూపించటమే కాదు..సాంకేతికతతో రైలు ప్రయాణం చేసే వారికి సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతోంది. ఈ సౌకర్యంపేరు.. డెస్టినేషన్ ఎలర్ట్ వేకప్ అలారమ్.
చాలామంది రైలు ప్రయాణికులు.. లేట్ నైట్ లో తాము దిగాల్సిన స్టేషన్ ఉంటే.. నిద్రలోకి జారిపోయి.. తాము దిగాల్సిన స్టేషన్ దాటేసి.. తర్వాతి స్టేషన్ లలో దిగి ఇబ్బందులకు గురవుతుంటారు. ఇలాంటి వారికి తాజాగా షురూ చేసిన సేవలు చాలా సాయంగా మారతాయి.
ఈ సేవలు ఎలా పని చేస్తాయంటే.. రైలు ప్రయాణం చేసే వారిలో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఉదయం 7 గంటల లోపు తమ ప్రయాణాన్ని ముగించే వారికి మాత్రమే ఈ సేవల్ని అందుకునే వీలు ఉంటుంది. తాజాగా భారతీయ రైల్వే ప్రారంభించిన ఈ కొత్త సౌకర్యంలో మనం దిగాల్సిన స్టేషన్ కు 20 నిమిషాల ముందు అలెర్టు అలారమ్ మోగుతుంది. ఇది మీ సెల్ ఫోన్ కు కాల్ వచ్చి.. అలారమ్ లా మోగుతూ ఉంటుంది.
ఈ సేవల్ని వినియోగించుకునేందుకు అదనంగా రూ.3 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే ఈ సదుపాయాన్ని కోరుకునే వీలు ఉంటుంది. డెస్టినేషన్ అలెర్టు వేకప్ అలారమ్ కోసం ఐఆర్ సీటీసీ హెల్ప్ లైన్ నెంబరు 139కు ఫోన్ చేయాలి.
లాంగ్వేజ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత డెస్టినేషన్ అలర్ట్ కోసం ముందు 7 నంబరు.. తర్వాత 2 నెంబరును ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పది అంకెల పీఎన్ఆర్ నెంబరును ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ చేసుకునేందుకు 1 నొక్కాలి. దీంతో రిక్వెస్టు పూర్తి అవుతుంది. మీ ప్రయాణాన్ని ముగించటానికి20 నిమిషాల ముందు వేకప్ అలెర్టు కాల్ వస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.