ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలైంది. కాగా... గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలా రు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మార్షల్స్‌ను రంగంలోకి దింపి.. సభ్యులను బయటకు పంపపాలని నిర్ణయించుకున్నారు. అ యితే.. ఇంతలోనే టీడీపీ సభ్యులు స్వయంగా వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. అయితే.. ఇప్పుడు టీడీపీ ఇలా వ్యవహరించడం సరైందేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఎందుకంటే.. ప్రజాస్వామ్య పరిర క్షణకు కంకణం కట్టుకున్నామని పదే పదే చెప్పే టీడీపీ.. ఇలా గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపే యడం ద్వారా.. గాలిలోకి విసిరేయడం ద్వారా.. ఎలాంటి సంకేతాలు పంపాలని నిర్ణయించుకుందని మేధావులు ప్రశ్నస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ప్రవచించిన సూత్రాలను చూస్తే.. స్వయంగా ఆయనే అప్పట్లో వైసీపీకి సుద్దులు చెప్పారు. స్పీకర్ కామెంట్లు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను అప్పట్లో ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ.. ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా.. గవర్నర్‌పైనే టీడీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడడం ఏమేరకు సమర్ధనీయం? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటి వరకు టీడీపీకి కొంత సానుభూతి ఉంది. అయితే.. ఇలాంటి చర్యల ద్వారా ఆ పార్టీ సానుభూతిని పోగొట్టుకునే ప్రమాదం ఏర్పడిందని అంటున్నారు.
బయటకు వచ్చాక ఎన్నిక సమర్ధింపు వ్యాఖ్యలుచేసినా.. సభలో ఒక పరిణితి చెందిన పార్టీ నాయకులుగా.. సుదీర్ఘ ప్రస్థానం ఉన్న పార్టీ సభ్యులుగా అనుసరించాల్సిన వ్యూహాలను వదిలేసి.. గవర్నర్ ఇలా ప్రసం గం ప్రారంభం చేయగానే.. అలా కాయితాలు చింపేసి.. వాకౌట్ చేయడం అంటే.. ఇది ఎన్ని చెప్పుకొన్నా.. ఎన్ని సమర్ధనలు చేసుకున్నా..తప్పేనని అంటున్నారు మేధావులు. గవర్నర్ వ్యవస్థ ఉన్నది.. చెప్పిన వెంటనే చేసేయడానికో.. మరిదేనికో కాదు.
అనేక సందర్భాల్లో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన అభ్యర్థనలను కూడా గవర్నర్లు పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతమాత్రాన విపక్షంగా ఉన్న పార్టీ గవర్నర్‌పై విరుచుకుపడడం అంటే. అది కూడా శాసన సభలోనే ఇలా వ్యవహరించడం అంటే.. ఇది వ్యూహాత్మకంగా ముందుగానే.. ప్లాన్ చేసుకుని చేసినట్టు భావించాల్సి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇది మరింత డ్యామేజీగా మారుతుందని అంటున్నారు.