కొవిడ్ తీవ్రత ఎక్కువగా వచ్చిన వారికి కొత్త తిప్పలు

Update: 2021-07-27 04:28 GMT
మాయదారి మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం ఆగమాగం కావటం తెలిసిందే. కరోనా రానోళ్లకు ఒక తిప్పలైతే.. వచ్చినోళ్లు ఎదురవుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. కరోనా మామూలుగా వచ్చినోళ్లకు ఒక మాదిరి.. తీవ్రత ఎక్కువగా వచ్చే వారిలో కనిపిస్తున్న మార్పులు.. ఎదురవుతున్న దుష్పప్రభావాలు అన్ని ఇన్ని కావన్నట్లుగా ఉంది. తాజాగా కోవిడ్ తీవ్రత ఎక్కువగా వచ్చినోళ్లకు ఎదురవుతున్న కొన్ని కొత్త సమస్యలను గుర్తించారు. మీకు కానీ మీకు దగ్గరైన వారు కానీ కరోనా తీవ్రంగా వచ్చి ఉంటే దీన్ని తప్పక చదవటే కాదు.. దీనికి పరిష్కారాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.

కరోనా తీవ్రంగా వచ్చిన వారి విషయంలో కొత్త తరహా ఆరోగ్య సమ్యలు ఎదురవుతున్నట్లుగా లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్.. కేంబ్రిడ్జ్.. సౌంతాప్టన్.. షికాగో విశ్వవిద్యాయలానికి చెందిన రీసెర్చర్లు కొత్త విషయాల్ని గుర్తించారు. దీని ప్రకారం కొవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల గురించి తెలిసిందే అయినా.. దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన .. వెంటిలేటర్ పై ఉండి చికిత్స పొంది బయటపడిన వారు.. వారు కోలుకున్న తర్వాత వారి తెలివితేటల్లో సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు.

ఏకాగ్రత లోపించటం.. సమస్యలకు పరిష్కారాల్ని వెతకలేకపోవటం.. పరిస్థితులకు తగ్గట్లు సరైన పదాల్ని పలకలేకపోవటం లాంటి సమస్యల్ని వారిలో గుర్తించినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగ్నిటివ్ డిఫెక్ట్స్ ఇన్పీపుల్ హు హావ్ రికవర్డ ఫ్రం కొవిడ్ 19 పేరుతో పరిశోధన వివరాల్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ద లాన్సట్ పత్రికలో ప్రచురించారు. ఈ అధ్యయనాన్ని ఏదో సింపుల్ గా చెప్పేయటం కాదు.. గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు మధ్యలో మొత్తంగా 81,337 మందిని  పరీక్షించినట్లుగా చెబుతున్నారు.

తాజా అధ్యయనంలో స్త్రీ.. పురుషులతో పాటు వివిధ వయస్కుల్ని.. వివిధ జాతులకు చెందిన వారిని పరిగణలోకి తీసుకున్నారు.వారికున్న ఇతరత్రా అనారోగ్య పరిస్థితుల్ని మదింపు చేశారు. కొవిడ్ తీవ్రస్థాయిలో వచ్చిన వారిలో తర్కం.. భావోద్వేగ సంబంధ.. మానసిక ప్రక్రియలు మందగించిన విషయాన్ని కూడా గుర్తించినట్లుగా చెబుతున్నారు. సో.. జర జాగ్రత్తగా ఉండటంతో పాటు.. ఈ అధ్యయనంలో మాదిరి మార్పులు గుర్తిస్తే.. వైద్యుల వద్దకు వెళ్లి.. అందుకు తగ్గ పరిష్కార మార్గాల్ని వెతకాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News