కొత్త జట్లు.. కొత్త ప్లేయర్లు.. ఊహించని మార్పులతో వచ్చే ఐపీఎల్

Update: 2020-11-30 02:30 GMT
ఐపీఎల్​ వచ్చేసిందంటే ప్రేక్షకులకు ఫుల్​ ఎంటర్​టైయిన్​మెంట్​. కరోనాతో ఐపీఎల్​ 2020 సాగుతుందో లేదో అని అంతా భావించారు. కానీ తగిన జాగ్రత్తలతో యూఏఈ వేదికగా ఐపీఎల్​ను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సీజన్​లో అందరూ ఊహించినట్టుగానే ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఎవరు విజయం సాధించినప్పటికీ.. ప్రేక్షకులకు మాత్రం ఎంజాయ్​మెంట్ దొరికింది. అయితే ఐపీఎల్​ 2020 ముగిసిపోగానే.. ఐపీఎల్​ 2021 పై అంచనాలు మొదలయ్యాయి.

అయితే ఐపీఎల్​ 2021 మాత్రం ఇండియాలోనే జరిగే అవకాశం ఉన్నది. అయితే ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనేది వేచిచూడాలి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న మ్యాచ్​లకు 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియంలలోకి అనుమతిస్తున్నారు. ఐపీఎల్​ 2021లోనూ అలాగే అనుమతిస్తారో లేదో వేచిచూడాలి. అయితే ఈ సారి ఐపీఎల్​లో మాత్రం భారీమార్పులు ఉండబోతున్నాయట. కొన్ని కొత్త జట్లు వచ్చి చేరబోతున్నాయని సమాచారం. మరోవైపు నిబంధనలు కూడా మార్చబోతున్నారట.

ప్రస్తుతం జట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశం ఉన్నది. అయితే ఆ నిబంధనను సడలించనున్నట్టు సమాచారం. ఈ సారి ఐదుగురు అంతకంటే ఎక్కువగా విదేశీ ప్లేయర్లు ఆడే అవకాశం ఉంటుంది. మరోవైపు కొత్తగా కొన్ని జట్లు చేరే అవకాశం ఉందని సమాచారం. ఏటా ఐపీఎల్‌లో కేవలం 8 జట్లు మాత్రమే ఆడుతున్నాయి. అయితే ఈ జట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. మరో రెండు నుంచి మూడు జట్లు కొత్తగా వచ్చే అవకాశం ఉన్నది. వరల్డ్​ కప్​ ఫార్మాట్​లో జట్లను గ్రూప్​ ఏ, గ్రూప్​ బీలు గా విభజించి మ్యాచ్ లు ఆడించనున్నారు. మ్యాచ్​ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.


Tags:    

Similar News