చ‌నిపోయాడ‌ని సానుభూతి చూపిస్తున్నారు

Update: 2017-12-21 14:27 GMT
సినీ న‌టుడు విజ‌య‌సాయి సూసైడ్ వ్య‌వ‌హారంతో ఆయ‌న స‌తీమ‌ణి వ‌నిత మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ఎంపిక చేసుకున్న ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన ఆమె విజ‌య్ కుమార్ త‌న‌కు మ‌ధ్య‌నున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. సంతోషంగా బ‌త‌కాల‌న్న ఉద్దేశంతో తాను విజ‌య్ పెళ్లి చేసుకున్నామ‌ని.. కానీ అత‌డి ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క విడిపోయామ‌న్నారు.

మూడేళ్లుగా తాము విడిగా ఉన్న‌ప్పుడు.. ఇప్పుడు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే విజ‌య్ మ‌ర‌ణానికి తాను ఎలా కార‌ణం అవుతాన‌ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు కాబ‌ట్టే.. సానుభూతి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని..కానీ అత‌డో సైకోలా వ్య‌వ‌హ‌రించేవార‌న్నారు.

విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసులో వ‌నిత కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు గ‌డిచిన కొద్దిరోజులుగా పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నా.. ఆమె ఆచూకీ ల‌భ్యంకాలేదు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ లో మాట్లాడిన ఆమె.. తాను కావాల‌నే పోలీసులకు లొంగిపోలేద‌ని.. తాను అత్తింటి నుంచి ఎలాంటి ఆస్తులు తీసుకోలేద‌ని.. ఆ ఆధారాల కోస‌మే తాను ర‌హ‌స్యంగా ఉంటున్న‌ట్లు చెప్పారు.

పెళ్లి త‌ర్వాత విజ‌య్ ప్ర‌వ‌ర్త‌న న‌చ్చేది కాద‌ని.. అందుకే విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొని పాప‌ను తీసుకొని తాను విడిగా వ‌చ్చేసిన‌ట్లు పేర్కొన్నారు. మూడేళ్లు దూరంగా ఉంటున్నా.. విజ‌య్ తో ఎప్పుడూ వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌లేద‌న్నారు. విజ‌య్ తండ్రి.. మామ మొద‌ట్లో బాగానే ఉన్నా.. త‌ర్వాత మాత్రం స‌రిగా ఉండ‌టం లేద‌న్నారు. ఆయ‌న ఎందుకు మారిపోయారో త‌న‌కు తెలీద‌న్నారు వ‌నిత‌.

విజ‌య్ చ‌నిపోయాడు కాబ‌ట్టి.. అత‌డికి స‌న్నిహితులుగా ఉన్న వారంతా సానుభూతి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని..కానీ అత‌డి వైఖ‌రి ఎలా ఉంటుందో స‌న్నిహితుల‌కు తెలుస‌న్నారు. విజ‌య్ ప్ర‌వ‌ర్త‌న‌కు సంబంధించిన త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్న‌ట్లుగా పేర్కొన్నారు. పాప‌ను విజ‌య్‌కు చూపించ‌లేద‌న్న మాట‌లో వాస్త‌వం లేద‌న్నారు. విజ‌య్ సైకోలా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని.. రెండుసార్లు పాప ఎదుటే త‌న‌పై భౌతిక‌దాడికి పాల్ప‌డ్డాడ‌ని చెప్పిన వ‌నిత‌.. ఈ విష‌యాన్ని గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్లో తాను ఫిర్యాదు చేసిన‌ట్లుగా చెప్పారు. విజ‌య్ తీరును తెలియ‌జేసే ఆధారాలు త‌న‌కు ల‌భించిన వెంట‌నే తానే పోలీసుల ఎదుట లొంగిపోనున్న‌ట్లుగా వ‌నిత పేర్కొన్నారు.
Tags:    

Similar News