పవన్ కల్యాణ్, పోసాని కృష్ణ మురళి మధ్య సాగిన మాటల యుద్ధం వివాదాస్పదమైంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు రాజకీయంగా హాట్ టాఫిక్ గా మారింది. అయితే ఇటీవల తన ఇంటిపై కొందరు రాళ్లతో దాడి చేశారని పోసాని ఆరోపించారు. తన ఇంటిపై ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి పరుష పదజాలంతో ధూషిస్తూ రాళ్లు రువ్వారని పోసాని ఇంటి వాచ్ మన్ పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దీంతో వారికి కొత్త ట్వస్ట్ ఏర్పడింది. పోసాని ఇంటి పరిసరాల్లో ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగింది. సీసీ కెమెరాలతో దాడి చేసినవారెవరో గుర్తించవచ్చని పోలీసులు అనుకున్నారు.
హైదరాబాద్లోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న ఇంటిపై అర్ధరాత్రి కొందరు యువకులు బండిపై వచ్చారని, ఆ తరువాత ఇంటిపై దాడి చేశారని ఇంటి వాచ్ మన్ పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడి జరిగిన సమయంలో పోసాని ఇంట్లో లేడు. ఆయన కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కేవలం ఆఫీసు అవసరాలకు మాత్రమే దీనిని వాడుతున్నారు. అయితే ఇటీవల పవన్ పై పోసాని చేసిన వ్యాఖ్యలపై కొందరు అదే రోజు అర్ధరాత్రి ఎల్లారెడ్డిగూడలోని తన ఇంటిపై దాడి చేశారని సూపర్ వైజర్ పోలీసులకు తెలిపారు.
పోలీసులు ఎల్లారెడ్డిగూడలోని పోలీసులు ఇంటిని పరిశీలించారు. అక్కడ జరిగిన దాడిలో పోసాని ఇంటికి సంబంధించిన గ్లాసెస్ పగిలినట్లు కనిపించాయి. అలాగే అక్కడ కొన్ని రాళ్లను కూడా గుర్తించారు. దాడి జరిగిన సమమంలో ఇంట్లోని పనివాళ్లు భయంతో లోపలికెళ్లి దాక్కున్నట్లు తెలిపారు. కొందరు రాళ్లు రువ్వడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించారని పనివాళ్లు పోలీసులకు తెలిపారు. కాగా ఈ దాడిలో పోసాని ఇంటి తలుపుల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎనిమిది నెలలుగా పోసాని ఆ ఇంట్లో ఉండడం లేదు. కేవలం వాచ్ మెన్ కుటుంబం మాత్రమే ఉంటోంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. ఎక్కువగా గచ్చిబౌలిలోని అపార్టమెంట్లోనే ఉంటాడని వాళ్లు తెలిపారు.
పోసాని ఇంటి వాచ్ మన్ పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా పోలీసులు పోసాని ఇంటి పరిసరాలను పరిశీలించారు. అయితే వారికి ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించలేదు. అయితే సీసీ కెమెరాలు ఇదివరకే ఏర్పాటు చేసుకోలేదా..? లేక దాడి చేయడానికి వచ్చిన వారే తీసేసారా..? అన్న కోణంలో విచారిస్తున్నారు. మొత్తానికి కొందరు యువకులు మాత్రం నానా హంగామా చేశారని స్థానికులు అంటున్నారు.
ఇక దాడి జరిగిన తరువాత పోసాని మరోసారి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన ఇంటిపై దాడి చేయించారని అంటున్నారు. అయితే జనసేన నాయకులు మాత్రం ఈ దాడికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. పోసాని వెనుక ఏపీ ప్రభుత్వం ఉందని, ఆయనతో పవన్ పై ఏపీ అక్కడి ప్రభుత్వం విమర్శలు చేయిస్తోందని తెలంగాణ జనసేన ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్ ఆరోపించారు. మరోవైపు తాము పోసానిపై చేసిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంపై అనుమానాలున్నాయని అంటున్నారు. తెలంగాణ నుంచి పోసాని కృష్ణ మురళిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక పవన్, పోసానిల మధ్య జరిగిన మాటల యుద్ధంతో ఇండస్ట్రీలో తీవ్ర చర్చ సాగుతోంది. ఇద్దరూ సినీ నటులే కావడంతో ఎవరు ఎవరి వ్యాఖ్యలను సమర్థిస్తారో అర్ధం కాకుండా ఉందని కొందరు చర్చించుకుంటున్నారు.