షాకింగ్.. కొత్త వేరియంట్​ తో 6 నెలల్లో మరో వేవ్

Update: 2022-02-23 02:30 GMT
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు తిరిగి సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. అయితే కోవిడ్ కొత్త వేరియంట్లకు సంబంధించిన మరో బాంబు పేల్చారు  కోవిడ్ టాక్స్ ఫోర్స్ నిపుణలు. కరోనా కొత్త వేరియంట్‌లపై పలు కీలక విషయాను వెల్లడించారు. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.

అయితే మరో కొత్త వేరియంట్ వచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ఇదే జరిగితే మరో 6 నుంచి 8 నెలల్లో  ఇంకో దశ భారత్ ను కబళిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా ఒమిక్రాన్ నుంచి వస్తున్న సబ్‌వేరియంట్‌ ల తీవ్రతపై కూడా కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్‌ లో భారీ నష్టాలను చవి చూసిన భారత్ లో మరో కోవిడ్  వేరియంట్ వచ్చే అవకాశం ఉందని కోవిడ్ టాక్స్ ఫోర్స్ నిపుణులు డా. రాజీవ్ జయదేవలన్ తెలిపారు. దశల వారీగా కోవిడ్ రూపాంతరాలు విస్తరిస్తున్న ట్లు చెప్పుకొచ్చిన ఆయన ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు మరో దశ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.  

భారత్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గినట్లు చెప్పారు. ప్రజలు కూడా సాధారణ  స్థితికి వస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో దేశంలో కొత్త వేరియంట్ ఉద్భవిస్తే వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఇంకో దశ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

వైరస్ వ్యాప్తి తగ్గినా సరే అది మన చుట్టూ ఉంటుందని రాజీవ్ తెలిపారు. దానిని కట్టడి చేసేందుకు ప్రజలందరూ తగిన రీతిలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని సూచించారు. లేకపోతే మరో కొత్త వేరియంట్ కు అవకాశం ఇచ్చిన వారం అవుతామని తెలిపారు. ఈ క్రమంలోనే కొత్త వేరియంట్ పుట్టుకొస్తే కచ్చితంగా ఇంకో దశ ఖాయం అని తెలిపారు.

కరోనా వైరస్ కు సంబంధించిన చరిత్ర అదే చెప్తుందని  రాజీవ్ అన్నారు. దీని ప్రకారం 6 నుంచి 8 నెలల్లో మరో సారి కొవిడ్ కేసులు అమాంతంగా పెరిగే అవకాశం లేక పోలేదని చెప్పారు. వైరస్ ఎప్పుడు వస్తే అప్పుడు మరో వేవ్ రావడం ఖాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్తగా పుట్టుకొచ్చిన వేరియంట్లు టీకాల నుంచి వస్తున్న వ్యాధి నిరోధక శక్తిని కూడా ఏమార్చగలవని తెలిపారు. ఇదే విషయాన్ని ఇప్పటికీ ఒమిక్రాన్ నిరూపించినట్లు చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఇదే  పరిస్థితులు నెలకొనవచ్చు అన్నారు.
Tags:    

Similar News