కరోనా వైరస్ అంటువ్యాధి. ఒకరి ద్వారా మరొకరికి సోకుతుంది. ఆ గాలి పీల్చిన ప్రమాదమే.. ప్రధానంగా ఊపిరితిత్తుల్లో చేరి మనిషిని కబళిస్తుంది. ఇప్పుడు సిగరెట్ - మద్యం తాగేవారికి కరోనా డేంజర్ బెల్ అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆవహించింది. ఈ క్రమంలో లాక్ డౌన్ తో దేశమంతా ఇంట్లోనే ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మించిన పని మరొకటి లేదు. అందుకే చెడు అలవాట్లకు కూడా దూరం అవుతే మంచిందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సిగరెట్ తాగేవారికి కరోనా ప్రధాన శత్రువు అంటున్నారు. సిగరెట్ ప్రధానంగా మన ఊపిరితిత్తులను బలహీనం చేస్తుంది. కరోనా కనుక సిగరెట్ తాగేవారికి సోకితే వారికి మరణం గ్యారెంటీ అని వైద్యులు చెబుతున్నారు. కరోనా ముప్పు స్మోకింగ్ చేసే వారికి 14 రెట్లు అధికమని చైనాలో జరిగిన పరిశోధనలో తేలింది. కరోనా సోకితే ఛాతి - ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ వస్తుంది. సిగరెట్ తాగేవారికి ఆల్ రెడీ ఊపిరితిత్తులు బలహీనంగా ఉండడంతో వారి మరణం తథ్యమంటున్నారు. స్మోక్ చేసే అలవాటు మానుకోమంటున్నారు. ఇక పోగాకు ఉత్పత్తులైన గుట్కా - జర్ధా - తంబాకు అలవాటున్న వారు కరోనాకు ప్రియ కస్టమర్లే. వారిని కబళించేస్తుంది. సో పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటే బెటర్ అని సూచిస్తున్నారు.
ఇక కరోనా మందుబాబులకు ఈజీగా సోకుతుందని అధ్యయనంతో తేలింది. మద్యం బాబుల రోగనిరోధక శక్తి చాలా తగ్గిపోతుంది. ఊపిరితిత్తులు - కిడ్నీల సామర్థ్యం పడిపోతుంది. దీంతో ప్రస్తుతం దేశంలో మద్యం బంద్ వేళ బ్లాక్ మార్కెట్ లో కొని తాగుతున్న వారికి కరోనా సోకడం ఖాయమని.. వారు మానుకుంటేనే బతుకుతారని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రాల్లో మద్యం బంద్ కావడంతో మందు బాబులు మద్యం దొరక్క గిజగిజ కొట్టుకుంటున్నారు. నగరాలు - పట్టణాల్లోని ఉన్నత స్థాయి వ్యక్తులు.. సాధారణ జనం కూడా మందు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీసులు - ఇతర స్టార్ హోటళ్లు - పబ్ యజమానులతో సాన్నిహిత్యం ఏర్పరుచుకొని కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లను తీసుకుంటున్నారు. పబ్బులు మూసివేసినప్పటికీ - యజమానులు తమ ఇళ్లలోకి మద్యం నిల్వలు తరలించికొని బ్లాక్ మార్కెట్ లో భారీగా అమ్ముకుంటున్నారు. ఒక్కో బాటిల్ ను డబుల్ ధరకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు. స్కాచ్ బాటిల్స్ అయితే వేలు పలుకుతున్నాయి.
మద్యానికి బానిస అయిన వారు ఎంత ధర అయినా పెట్టి కొంటున్నారు. కల్తీ మద్యం అంటగడుతుండడంతో వారికి వికాలం - అలసట - నిద్రలేమి - తలనొప్పి - చెమట - అధిక రక్తపోటు తదితర లక్షణాలతో ఆరోగ్యాలు పాడుతున్నారు. పైగా బయటకు వెళ్లి మద్యం తెచ్చుకుంటే వీరికి కరోనా సోకితే ప్రాణాలు హరియే.. లాక్ డౌన్ లో మద్యం బాబులు సుబ్బరంగా మద్యానికి దూరమైతే మంచిది. మద్యపానం అలవాటును దూరం చేసుకుంటే మరికొంత కాలం బతుకుతారని నిపుణులు సూచిస్తున్నారు. కల్తీ మద్యం తాగితే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.