కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తుంది. చైనాలోని వూహన్ సిటీలో పుట్టిన మహమ్మారి ప్రపంచంలోని 95 దేశాలకి వ్యాప్తిచెంది..అందరిని గజగజ వణికిస్తుంది. ఇకపోతే , ఈ ప్రపంచంలో ఒక్కోక్క సమయంలో ఒక్కోక్కటి ఫెమస్ అవుతుంటుంది. ఆలా కొత్తగా ఏదైనా వచ్చిన ప్రతిసారి ..వాటి పేర్లమీద వెబ్‌సైట్ డొమైన్లు క్రియేట్ అవుతుంటాయి. ఇంటర్ నెట్లో దేని గురించి అయితే , ఎక్కువగా వెతుకుతున్నారో , ఆ విషయాల పేరుతో కొత్త కొత్త వెబ్ సైట్ డొమైన్లు రిజిస్టర్‌అవ్వడం అనేది ప్రపంచంలో సాధారణం.
అలాగే ఇంటర్‌నెట్లో మాల్ వేర్ ని వ్యాప్తి చేసి సిస్టమ్స్‌ని పాడు చేసే కోడర్లు, ఎప్పుడు ఏ విషయానికి ఎక్కువ పాపులారిటీ ఉంటే దాన్ని, మాల్ వేర్ వ్యాప్తికి వినియోగించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కొరొనా వైరస్ని వీళ్లు కూడా బాగానే ఉపయోగించుకుంటున్నారట. చైనాలో వైరస్ బయటపడ్డ రోజునుంచీ కరోనా, కోవిడ్ లాంటి పేర్లతో కొత్త కొత్త వెబ్ డొమైన్లు రిజిస్టర్ అవుతున్నాయి. అయితే అవన్నీ కూడా నిజంగా ఆ వైరస్ గురించి సమాచారం ఇచ్చేవో, లేదా ఆ వైరస్‌కి సంబంధించిన న్యూస్‌ని అందించేవో అని అనుకుంటే పెద్ద పొరబాటే.
రిజిస్టర్ అయిన డొమైన్లలో సగానికి సగం డొమైన్లు -మాల్ వేర్‌ని హోస్ట్ చేస్తున్నాయట. ఒకవేల మీరు ఆ డొమైన్ లో క్లిక్ చేసి సర్వర్లోకి వెళ్తే , మీ కంప్యూటర్ లో ఉన్న డేటా మొత్తం వారిచేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని చెక్ పాయింట్, ప్రూఫ్ పాయింట్ అనే రెండు సైబర్ సెక్యూరిటీ సంస్థలు గుర్తించాయి. దీనితో కరోనా వైరస్ ప్రభావంతో వణికిపోతున్న ప్రజలు ..దీని గురించి తెలుసుకొని ఇదెక్కడి సమస్యరా బాబు అని తలలుపట్టుకుంటున్నారట.