కరోనా వైరస్ ప్రపంచంలో తాండవం చేస్తోంది. శనివారం మధ్యాహ్నం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏకంగా 11,00,283 గా నమోదైంది. 11 లక్షలు దాటి దూసుకుపోతోంది. భారత్ లోనూ ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఏకంగా 2902 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు తో 3వేల కేసులు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 2,28370మంది కోలుకున్నారు. అలాగే మరణాల సంఖ్య ఏకంగా 59128కు చేరుకుంది.
చైనాలో కరోనా సోకిన వారిలో 100 మందిలో 3 చనిపోతే.. ప్రస్తుతం ఆ సంఖ్య 21కి చేరింది. చైనాలోనూ కరోనాతో మరణాల రేటు పెరుగుతోంది.
ఇక అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,037కు దాటేసింది. శుక్రవారం 31వేల మంది కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఏకంగా అమెరికా వ్యాప్తంగా 24 1480మంది మరణించారు. దీన్ని బట్టి అమెరికాలో వైరస్ తీవ్రత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా చరిత్రలోనే ఒకే రోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి అట.. దీంతో అమెరికాలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 7406కు చేరింది.
ఇటలీలో కొత్తగా 4585 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 11వేలు దాటాయి. శుక్రవారం 76 మంది చనిపోయారు. మృతుల సంఖ్య దేశంలో 14వేలకు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు ఇటలీలోనే చోటుచేసుకున్నాయి.
ఇటలీ తర్వాత స్పెయిన్ లో మృతుల సంఖ్య భారీగా ఉంది. శుక్రవారం 850మంది మరణించారు. మొత్తం మరణించిన వారి సంఖ్య 11198కు చేరింది. బాధితుల సంఖ్య 1.19లక్షలకు చేరింది.
ఫ్రాన్స్ లో ఒక్కరోజే 1120మంది మరణించారు. ఫ్రాన్స్ లో 64వేలకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది.
*భారత్ లో 2902కు చేరిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2902కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. వీరిలో 68మంది మరణించగా.. 2650మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. 184మంది కోలుకున్నారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. 423మందికి కరోనా సోకింది. 19మంది మరణించారు.
*ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శనివారం కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. నెల్లూరులో అత్యధికంగా 32, అనంతపురంలో అత్యల్పంగా 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో మృతుల సంఖ్య 2కు చేరింది. ఈ మృతులంతా మర్కాజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే..
*తెలంగాణలో 229కి కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. శుక్రవారం కొత్తగా 75 కేసులు నమోదయ్యాయి. 15మంది డిశ్చార్జి అయ్యారు. 11మంది ఇప్పటివరకు మరణించారు. మొత్తంగా 229కి కరోనా కేసులు పెరిగాయి.