స్మోకర్స్ కి కరోనా వస్తే అంతే సంగతి

Update: 2020-03-31 02:30 GMT
మానవాళిని కరోనా మహమ్మారి కబళిస్తోంది. సామాజిక దూరం పాటించాలి - షేక్ హ్యాండ్ ఇవ్వవద్దు.. మన సంప్రదాయం ప్రకారం దండం పెట్టడమే మంచిది.. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలనే మాటలు వింటూనే ఉన్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ కూడా ప్రకటించింది. ఐతే కరోనా కట్టడికి స్మోకింగ్ వంటి వాటిపై కూడా యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. స్మోకింగ్ మానకుంటే పొగరాయుళ్లను కరోనా వెంటాడుతుందట! ఎందుకంటే పొగతాగే అలవాటు ఉన్నవారే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడ్డారట.

గత నెల రోజులుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలో కరోనా వల్ల చనిపోయిన వారిలో ప్రతి పదిమందిలో ఇద్దరు పొగ త్రాగేవారు ఉన్నారట. దీంతో కరోనా కారణంగా స్మోకింగ్ చేసేవారికి ఎక్కువగా అంటుకుంటుందని తెలుస్తోందని అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఏడుగురు అరబ్బులలో ఒకరు స్మోకింగ్ చనిపోతున్నారట. స్మోకర్లలో చైనా - భారత్ వరుసగా టాప్ 2లో ఉన్నాయి.

సిగరేట్ స్మోకింగ్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రమాదకర నికోటిన్ మెదడు - గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. పొగ తాగడం వల్ల కడుపులో మంట - ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఊపిరితిత్తులు నలుపు రంగులోకి మారుతాయి. స్మోకింగ్ వల్ల 12 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. పొగ మరీ ఎక్కువగా తాగితే పురుషత్వం తగ్గిపోతుంది. మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు ఉంటాయి.
   

Tags:    

Similar News