కిస్సింగ్ డిసీజ్: ముద్దు ఇస్తే ప్రాణాలు పోతాయి

Update: 2020-07-28 12:30 GMT
శతకోటి అలవాట్లకు అనంతకోటి వైరస్ లు అన్నట్టుగా మన భవిష్యత్ అంధకారమవుతోంది. ఇప్పటికే ముట్టుకుంటే అంటుకునే కరోనా వైరస్ తో అల్లాడుతున్న జనాలకు ఇప్పుడు ముద్దులు ఇస్తే చచ్చిపోయే కొత్త రోగం వచ్చింది.

సృష్టిలో మనిషి బతకాలంటే సృష్టి కార్యం తప్పనిసరి. ఆ ప్రక్రియలో ముద్దులు.. ముచ్చట్లు.. హగ్గులు కామన్. అయితే ఇప్పుడు ముద్దులు ఇస్తే చనిపోయే కొత్త వైరస్ పుట్టుకొచ్చింది.

కొంతమంది లాలాజలంలో ‘ఎప్స్టీన్ బార్’ అనే వైరస్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ప్రాణాంతక వైరస్ అని.. ఇది ఒకరి నుంచి మరొకరికి ముద్దు ఇవ్వడం వల్ల వ్యాపిస్తోందని తేలింది. ఈ వ్యాధి వ్యాపిస్తే తీవ్రమైన అనారోగ్యానికి గురికావాల్సి వస్తోందని తేల్చారు.

ముద్దుల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సోకితే తలనొప్పి... ఫీవర్ వంటి రోగాలు వస్తాయి. క్రమంగా మెదడు మొద్దుబారిపోతుంది. నడవలేని స్థితికి చేరుకుంటారు.చనిపోయే ముందు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. ముద్దుల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని మోనో న్యూక్లియోసిస్ లేదా మోనో లేదా కిస్సింగ్ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి వెంటనే వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ఆలస్యం జరిగే కొలదీ ప్రాణాలు పోతాయని తేల్చారు. సో ముద్దులిచ్చేటప్పుడు జాగ్రత్త మరీ..
Tags:    

Similar News