కోహ్లీ తర్వాత విలియమ్స్‌ కు ఐసీసీ షాక్‌

Update: 2019-06-24 13:51 GMT
ఇటీవల జరిగిన మ్యాచ్‌ లో టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంపైర్స్‌ తో ఒక విషయమై వాగ్వివాదంకు దిగిన విషయం తెల్సిందే. బ్యాట్స్‌ మన్స్‌ ఔట్‌ విషయంలో అంపైర్లు తీసుకుంటున్న నిర్ణయంపై కోహ్లీ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఐసీసీ రూల్స్‌ ప్రకారం అంపైర్‌ పై అసహనం కాని కోపం కాని వ్యక్తం చేస్తే మ్యాచ్‌ ఫీజ్‌ లో కోత విధించడం జరుగుతుంది. అంపైర్లతో వాగ్వివాదంకు దిగిన కారణంగా కోహ్లీ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పెట్టినట్లుగా ఐసీసీ ప్రకటించింది. తాజాగా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్స్‌ తో పాటు ఆ జట్టు మొత్తంకు కూడా ఐసీసీ ఫీజు కోత విధించింది.

తాజాగా న్యూజిలాండ్‌ మరియు వెస్టిండీస్‌ జట్ల మద్య మ్యాచ్‌ జరిగిన విషయం తెల్సిందే. ఆ మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ ఆరు పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. అయితే న్యూజిలాండ్‌ జట్టు స్లో ఓవర్‌ రేటు నమోదు అయ్యింది. ఒక ఓవర్‌ ఆలస్యంగా వేసిన కారణంగా ఫీల్డ్‌ అంపైర్లు ఐసీసీ క్రమశిక్షణ ప్యానల్‌ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. వారు ఒక్క ఓవర్‌ స్లో ఓవర్‌ రేటు కారణంగా కెప్టెన్‌ విలియమ్స్‌ కు 20 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించడంతో పాటు జట్టు సభ్యులందరికి 10 శాతం చొప్పున మ్యాచ్‌ ఫీజులో కోత విధించినట్లుగా ప్రకటించింది. ఫీల్డు అంపైర్లు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాల కారణంగా కెప్టెన్స్‌ ఫైన్స్‌ చెల్లించాల్సి వస్తుందని క్రీడాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News