అమెరికా పొమ్మంటే..న్యూజిలాండ్ వెల్ కం అంటోంది

Update: 2017-03-15 17:20 GMT
అవ‌కాశాల స్వ‌ర్గ‌దామం అనే పేరున్న అమెరికాలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌తో క‌లత చెందుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు తీపిక‌బురు. అమెరికాలో హెచ్‌1బీ వీసాలకు ఎస‌రు పెట్ట‌డం, హెచ్‌4బీ వీసాల‌పై క‌త్తి, గ్రీన్ కార్డ్ పై ప‌రిమితులు వంటి అంశాల‌తో స‌త‌మ‌తం అవుతున్న టెక్ నిపుణుల‌కు న్యూజిలాండ్ తీపిక‌బురు చెప్పింది. త‌మ దేశంలో ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అంతేకాదు ఇంకా బోలెడు ఆఫ‌ర్లు ఇచ్చింది. ఉచిత వ‌స‌తి, ప్ర‌యాణ స‌దుపాయాలు వంటివి క‌ల్పిస్తాం రారమ్మంటూ పిలుస్తోంది.

రిపబ్లిక‌న్ పార్టీ నేత అయిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా బాద్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశీయులకు ముఖ్యంగా భార‌తీయుల‌కు పెద్ద ఎత్తున ఇబ్బందులు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌ల‌స ఉద్యోగుల విష‌యంలో ట్రంప్ స‌ర్కారు తెస్తున్న కొత్త కొత్త నిబంధ‌న‌ల‌తో ఉద్యోగుల గుండెల్లో గుబులు రేగుతోంది. దీంతోపాటుగా ఆ దేశంలో జాత్య‌హంకార దాడులు జ‌రుగుతుండ‌టంతో అంతా బెంబెలెత్తిపోతున్నారు. భార‌తీయుల‌పైనే ఎక్కువ‌గా దాడులు జ‌రుగుతుండ‌టం కూడా కొత్త సందేహాల‌కు దారితీస్తోంది. ఈ ప‌రిణామాల‌తో మ‌న టెక్ నిపుణులు సైతం ఇత‌ర దేశాల‌వైపు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ పరిస్థితులను గమనించిన న్యూజిలాండ్ మ‌న టెక్ నిపుణుల‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ దేశంలో పనిచేసేందుకు వచ్చే టెక్కీలకు ఉచిత ప్రయాణ వసతితో పాటు ఉచిత బసను కూడ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అది కూడా ఆ దేశ రాజ‌ధాని వెల్లింగ్‌ట‌న్‌ లో హ్యాపీగా ఉద్యోగం చేసుకునే చాన్స్‌.

లుక్ సీ పేరుతో ఈ ఉద్యోగ‌ ప్ర‌చారాన్ని న్యూజిలాండ్  ప్రారంభించింది. దీని ప్ర‌కారం వంద టెక్ వర్కర్లకు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తోంది. వీరందరికీ  ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఉచిత ప్రయాణ వసతితో పాటు ఉచిత బసను కూడ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ట్రంప్ పాలకవర్గం అనుసరిస్తున్న విధానాలతో టెక్కీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పరిస్థితులను గమనించిన న్యూజిలాండ్ దేశం టెక్కీలకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. తమ దేశంలో పనిచేసేందుకు వచ్చే టెక్కీలకు ఉచిత ప్రయాణ వసతితో పాటు ఉచిత బసను కూడ ఏర్పాటు చేస్తామని ఆ దేశం ప్రకటించింది. ఈ ఏడాది మే 8 నుండి 11 వరకు నాలుగురోజుల పాటు జాబ్ ఇంటర్వ్యూలకు టెక్ లీడర్లతో పాటు మీట్ ఆప్స్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వినూత్న ఆఫ‌ర్ పై వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెఫ్టర్ మాట్లాడుతూ తమ టెక్ ఆవిష్కరణలు సుదూర దేశాలకు ప్రయాణించాలని తాము భావిస్తున్నామని అందులో భాగంగానే ఎక్కువమంది ప్రతిభావంతుల‌ను తీసుకునేందుకు ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలిపారు. ఇంటర్వ్యూలకు హజరుకావాల్సిన వారు తొలుత తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయ‌న కోరారు. వెల్లింగ్‌ట‌న్‌లోనే అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తామ‌ని, నైపుణ్య‌వంతులకు ఆయా సంస్థ‌లు అక్క‌డే ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు వ‌స్తాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News