ఈ తుఫాన్ శిశువు.. పేరేంటో తెలుసా?

Update: 2019-05-03 10:53 GMT
అప్పట్లో అంతరిక్షంలో ఫెయిల్ అయిన ‘స్కైలాబ్’ భూమ్మీద పడ్డప్పుడు భూమి అంతం అవుతుందని అంతా కోళ్లు, మేకలు గొర్రెలు కోసుకొని తిన్నారు. స్కైలాబ్ పడినప్పుడు పుట్టిన పిల్లలకు దోషనివారణగా ‘స్కైలాబ్’ అనే పేరుపెట్టారు.

ఇప్పుడు బంగాళాఖాతంలో ‘ఫొని’ తుఫాన్ ఒడిషా తీరం పెను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఒడిషా ఉత్తరాంధ్రలో ఈ తుఫాన్ ప్రభావం భారీగా ఉంది. అయితే ఈ తుఫాన్ తీవ్రతలో ఈ రోజు ఉదయం భువనేశ్వర్ లో ఓ మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ మహిళ భువనేశ్వర్ లో రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తోంది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఫణి తుఫాన్ ఒడిషాను అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో ఆమెకు పుట్టిన ఆడశిశువుకు కూడా అదే పేరును పెట్టారు. తుఫాన్ సమయంలో పుట్టిన ఆ చిన్నారిని అందుకు గుర్తుగా చెడుదోషం పోవాలని తుఫాన్ పేరే పెట్టడం విశేషం.


Tags:    

Similar News