మూడు ముళ్లు వేశాడు.. తన భార్యతో తన ఇంటి బాట పట్టాడు. పెళ్లి జరగడంతో కుటుంబసభ్యులు ఆనందంతో ఆ దంపతులకు స్వాగతం పలకాలని డీజే ఏర్పాటు చేశారు. ఆ డీజేలో పాటల చప్పుళ్లకు అనుగుణంగా కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు డ్యాన్స్ లు చేశారు. వారితో కలిసి నూతన వధూవరులు నృత్యాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఉన్నట్టుండి పెళ్లి కుమారుడు హఠాన్మరణం చెందాడు. పెళ్లియిన కొన్ని గంటల్లోనే మృతి చెందడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని బోధన్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
బోధన్ పట్టణంలోని బ్రాహ్మణ గల్లీకి చెందిన గణేశ్ (25) దుబాయిలో పని చేస్తున్నాడు. వారం కిందట దుబాయి నుంచి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం అతడు వివాహం చేసుకున్నాడు. ఈ ఆనందం లో రాత్రి బారాత్ నిర్వహించారు. వధువుతో పాటు వరుడు స్వగ్రామం చేరారు. ఈ సందర్భంగా బరాత్ నిర్వహించారు. డీజేలు పెట్టి పెద్ద పెద్ద బాక్స్ ల్లో పాటలు వస్తుంటే కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆనందోత్సాహాలతో డ్యాన్స్ లు చేశారు. అనంతరం వధూవరులను కూడా వారి మధ్యకు తీసుకొచ్చి డ్యాన్స్ చేయించారు. ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన గణేశ్ డీజే సౌండ్ కు తీవ్ర అస్వస్థత కు గురయ్యాడు. గణేశ్ ఒక్క సారిగా కుప్ప కూలిపోయాడు.
ఈ ఘటనతో షాక్ కు గురైన కుటుంబ సభ్యులు నిజామాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో గణేశ్ మృతి చెందాడు. పెళ్లైన కొన్ని గంటలకే వరుడు మృతి చెందడం తో అతడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఉదయం పెళ్లి కొడుకు గా ఉన్న గణేశ్ రాత్రి శవంగా మారడం తో ఆ నవ వధువుకు దిక్కు తోచడం లేదు. బారాత్ లో భారీ సౌండ్ బాక్స్‌లతో కూడిన డీ.జే కారణంగానే గణేశ్ మరణించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.