ఏపీ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలన్న జగన్ కల.. ఆయనకు పెను సవాళ్లకు ఎదుర్కొనేలా చేస్తుందని చెబుతున్నారు. ఎన్నికల్లో చారిత్రక విజయం తర్వాత తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన వేళ.. తొలి కేబినెట్ కూర్పును చాలా సింఫుల్ గా తేల్చేసిన సీఎం జగన్.. మూడేళ్ల పాలనా అనుభవం తర్వాత మాత్రం పునర్ వ్యవస్థీకరణ విషయంలో మాత్రం కిందా మీదా పడుతున్నారట. అనుభవం కొత్త సందేహాల్ని తెస్తుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతంసీఎం జగన్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పాలి.
సోమవారం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితుల్లో శనివారం రాత్రికి సైతం కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేయలేకపోవటం చూస్తే.. సీఎం జగన్ ఎంతటి ఒత్తిడిలో ఉన్నారో అర్థమవుతుంది. మార్పులు చేర్పులతో ఆయన కిందా మీదా పడుతున్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని.. పాతిక మంది లోక్ సభ అభ్యర్థుల్ని ఎంపిక చేసిన సమయంలోనూ ఇంతటి కసరత్తు లేదని.. చాలా సింఫుల్ గా ఆయన పని కానిచ్చేశారని చెబుతారు. అందుకు భిన్నంగా ఉన్న మంత్రుల్ని తీసి కొత్త వారిని ఎంపిక చేసే విషయం.. ఆయనకు ఇప్పుడు కత్తి మీద సాముగా మారిందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. పాత కేబినెట్ కు సంబంధించి ఎవరిని కొనసాగించాలన్న దానిపై పెద్ద ఎత్తున కసరత్తు చేసిన జగన్.. శనివారం నాటికి వడబోతపోసిన ఒక జాబితాను సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. దీని ప్రకారం.. పది మంది పేర్లను ఫైనల్ చేసుకున్న జగన్.. వారిలో ఆరుగురు వరకు కొత్త కేబినెట్ లో కంటిన్యూ చేస్తారని.. మరీ ఒత్తిడి పెరిగితే ఒకరిద్దరికి అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు. పాత కేబినెట్ లో ఉన్న వారిలో వడబోసిన జాబితాలో ఉన్న పది మంది తాజా మాజీలు పేర్లు ఇలా ఉన్నాయి.
- గుమ్మనూరు జయరాం
- ఆదిమూలపు సురేష్
- నారాయణ స్వామి
- తానేటి వనిత
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- బొత్స సత్యానారాయణ
- శంకర నారాయణ
- కొడాలి నాని
- కన్న బాబు
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఈ పది మందిలో ఆరుగురు పేర్లు మాత్రం కన్ఫర్మ్ గా కేబినెట్ 2.0లో ఉంటాయని చెబుతున్నారు. అయితే.. మిగిలిన వారికి సంబంధించి వారికి రీప్లేస్ మెంట్ కు సరైన వారు దొరకకున్నా.. సామాజిక సమీకరణాలు సెట్ కాకున్నా.. మాత్రం ఒకరిద్దరు పేర్లు పెరిగే వీలుందంటున్నారు. అంటే.. రాజీనామా చేసిన మొత్తంలో కనీసం ముప్ఫై శాతం మంది పాత వారు కొత్త కేబినెట్ లో కంటిన్యూ అవుతారని తెలుస్తోంది.