క్రిప్టో ఇన్వెస్టర్లకు షాక్..: ఏప్రిల్ 1 నుంచి..

Update: 2022-03-29 23:30 GMT
కంటికి కనిపించకుండా వ్యవస్థను నడిపే మనీనే క్రిప్టో కరెన్సీ. కేంద్రం లేదా ఆయా దేశాల బ్యాంకుల ఆధీనంలో నడిచే ఈ డిజిటల్ కరెన్సీపై ఇటీవల మనదేశ పార్లమెంట్లో చర్చ సాగింది. ఆర్థిక బిల్లులో చేసిన సవరణల్లో క్రిప్టో కరెన్సీ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. క్రిప్టో కరెన్సీల మైనింగ్ విషయంలో జరిగే మౌలిక సదుపాయాల ఖర్చును సముపార్జన ఖర్చుగా భావించవచ్చా..? అనే చర్చ సాగుతోంది. అలాగే వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుంచి వచ్చే లాభాలు ఉపయోగించుకోవచ్చా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే క్రిప్టో కరెన్సీని యూజ్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం లెటేస్టుగా ఓ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి దీనిని పన్ను కిందకు తీసుకువస్తున్నాం అని ప్రకటించింది. దీంతో క్రిప్టో కరెన్సీని యూజ్ చేసేవారికి షాక్ తగిలినట్లయింది.

వర్చువల్ డిజిటల్ కరెన్సీ ట్రాన్స్ ఫర్లపై 30 శాతం పన్ను కిందకు తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించింది. అయితే తాజాగా ఏప్రిల్ 1 నుంచి క్రిప్టో కరెన్సీల ఆదాయాలపై పన్నును అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. దీంతో క్రిప్టో పన్ను రేటు స్టాక్ ట్రెండింగ్ ను మరింత లాభదాయకంగా మార్చింది. అయతే పన్నులు ఎలా వేస్తారు..? అనే సందేహం లేకుండా వివరించారు. ఉదాహరణకు 200 రూపాయలు లాభం వస్తే దానిపై 30 శాతం పన్ను వేస్తారు. అంటే 60 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. అయితే ఈ మార్కెట్లో ఎంత కరెన్సీని ఇన్వెస్ట్మెంట్ చేసినా దానిపై ఎలాంటి పన్ను విధించరు.

అయితే క్రిప్టో కరెన్సీ విషయంలో ప్రభుత్వం పన్నులు విధిస్తున్నా నష్టాలపై ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. మరోవైపు ఒక అసెట్స్ లో వచ్చిన లాభాలతో మరో వర్చువల్ అసెట్స్ లో వచ్చిన లాభాలను కలపడం కుదరదన్నారు. మొత్తానికి మూలధన ఆస్తియా..? లేక వేరేనా..? అనేది తేలకుండానే పన్ను విధిస్తారు. అన్ని క్రిప్టో ట్రాన్సాక్షన్ పై ఒక శాతం పన్ను ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎక్చేంజీల ద్వారా ట్రేడింగ్ నిర్వహించి లాభాలను ప్రభుత్వానికి నివేదించకపోతే అది చట్ట విరుద్ధంగా భావిస్తారు. క్రిప్టో పన్ను ద్వారా డిజిటల్ కాయిన్స్ గా మారే అవకాశం ఉందా అంటే ఆర్బీఐ జాచీ చేస్తే మాత్రమే డిజిటల్ కరెన్సీగా గుర్తిస్తారు. ఇతర క్రిప్టోలకు ఇది వర్తించదు. దీంతో ఓన్లీ ట్రాన్సాక్షన్ మాత్రమే.. వస్తువులు కొనుగోలు చేయరాదు.

ఇదిలా ఉండగా క్రిప్టో కరెన్సీ పేరుతో చాలా సంస్థలు వెలుస్తున్నాయి. సామాన్యులను ఆసరగా చేసుకొని సైబర్ కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పి లక్షల్లో డబ్బలు గుంజుతున్నారు. ఇటీవల ఈ మోసాలు మరీ ఎక్కువయ్యాయి. హైదరాబాద్లోని నారపల్లికి చెందిన ఓ వ్యక్తి రూ.85 లక్షలు పోగొట్టుకున్నాడు. 14 షెల్ కంపెనీల ద్వారా ముఠా మోసాలకు పాల్పడినట్లు సైబర్ పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News