హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ దందా ఇప్పుడు పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చాలా దగ్గరగా ఉన్న ఈ పబ్ లో సాగిన డ్రగ్స్ వినియోగ ఉదంతం.. పోలీసుల డెకాయి ఆపరేషన్ కారణంగా బయటకువచ్చింది. దీంతో.. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన లోతుగా ఆరా తీయటం షురూ చేశారు. ఈ ఉదంతంపై ఇంటెలిజెన్సు అధికారులు పబ్బుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై సీక్రెట్ గా విచారణ మొదలైంది.
దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని చూస్తే.. హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ దందా ఇటీవల ఎక్కువైనట్లుగా గుర్తించారు. మరి.. పబ్బులకు వచ్చే వారికి డ్రగ్స్ ను ఎలా ఇవ్వాలన్న దానిపై సరికొత్త కోడ్ ను పోలీసులు గుర్తించినట్లుగా చెబుతున్నారు. కొందరు ఎంపిక చేసిన వినియోగదారులను ఏ పబ్ కు వెళ్లినా గుర్తించేందుకు వీలుగా వారి చేతికి టాటూ వేయటం ద్వారా.. డ్రగ్ కస్టమర్లన్న విషయం అర్థమయ్యేలా చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
కస్టమర్ల చేతి మణికట్టుపై ఉండే టాటూ ఆధారంగాఏ డ్రగ్ ఇవ్వాలన్న విషయాన్ని అర్థమయ్యేలా ఈ టాటూ ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ ఈ టాటూ కుడి చేయి మణికట్టుపై ఉంటే.. వారికి గంజాయ్.. హష్ ఆయిల్ ఇవ్వాలన్నది అర్థమని.. ఒకవేళ.. ఎడమ చేతి మణికట్టుపై టాటూ ఉంటే.. కొకైన్.. ఎండీఎంఏ లాంటి డ్రగ్స్ ఇవ్వాలన్నది కోడ్ గా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా దీన్ని అమలు చేస్తున్నట్లుగా తాజా విచారణలో బయటకు వచ్చినట్లు చెబుతున్నారు.
అంతేకాదు.. పబ్బుల్లో పార్టీ మొదలైన వెంటనే డ్రగ్స్ ను సరఫరా చేయటం లేదని.. పార్టీ అర్థరాత్రి దాటిన తర్వాతే ఈ గబ్బు వ్యవహారానికి తెర లేస్తుందని చెబుతున్నారు. డ్రగ్స్ వినియోగించే బ్యాచ్ కు అవసరమైన మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకు వీలుగా పక్కా ప్లాన్ తో పలు డ్రగ్స్ కు పని చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. దీని గుట్టును పోలీసులు అధికారికంగా ఎప్పుడు రట్టు చేస్తారో చూడాలి.