ట్విట్టర్ లో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కొన్ని సార్లు ప్రతిపక్షాలపై సెటైర్లు కూడా వేస్తుంటారు మంత్రి కేటీఆర్. ప్రతిపక్షాలకు కౌంటర్లకు ట్విట్టర్ నే ఆయుధంగా వాడుతుంటారు. తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ట్వీట్ చేశాడు. గుజరాత్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలపై కేటీఆర్ వేసిన సెటైర్ అద్భుతంగా పేలింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఒక రోజు పవర్ హాలీడే ఉంటుందని ఇటీవల గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ఈ ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు.
ట్విట్టర్ లో గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన పవర్ హాలీడే మంత్రి కేటీఆర్ ‘కేజీఎఫ్’ చిత్రం డైలాగ్ తో బీజేపీకి పంచ్ ఇచ్చాడు. ‘శక్తివంతమైన వ్యక్తులు వచ్చిన గుజరాత్ రాష్ట్రంలో పవర్ హాలీడే నా? ’ అంటూ మంత్రి కేటీఆర్ కేజీఎఫ్ డైలాగ్ తో ఎద్దేవా చేశారు. గుజరాత్ లో ఉంది ‘డబుల్ ఇంజినా.. లేదా ట్రబుల్ ఇంజినా?’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ లో విరుచుకుపడ్డారు.
మరోవైపు మిషన్ భగీరథ పథకంలో కేంద్రం రూపాయి ఇవ్వలేదని కేటీఆర్ ఏకంగా మోడీకి ట్యాగ్ చేసి నిలదీశారు. ‘జల్ జీవన్’ పథకాన్ని ప్రారంభించిన మోడీ దీనిపై ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో పథకం ప్రవేశపెట్టిన మోడీజీ.. తెలంగాణకు మాత్రం భగీరథ పథకానికి ఎందుకు నీళ్లు ఇవ్వలేదని నిలదీశారు.