తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ జన్మదినం రోజున నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఎన్టీయార్ పుట్టినరోజు మే 28వ తేదీ అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఆ సందర్భంగా పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రతి ఏడాది మే 27, 28, 29వ తేదీన జరుపుకోవటం ఆనవాయితి. అయితే రాబోయే మహానాడును మూడు రోజులు కాకుండా కేవలం మే 28వ తేదీన ఒక్కరోజు మాత్రమే జరుపుకోవాలని డిసైడ్ అయ్యింది.
రాబోయే మహానాడును ఒంగోలు శివార్లలో నిర్వహించబోతున్నారు. ఒంగోలు ప్రాంతంలో నీటి ఎద్దడి, మండిపోతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని ఒక్కరోజు మాత్రమే నిర్వహించబోతున్నారు. అయితే 27వ తేదీన 5 వేలమందితో విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. మహానాడును ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తున్నా ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలను మాత్రం ఏడాదంతా జరపాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు.
గడచిన రెండేళ్ళుగా మహానాడును వర్చువల్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భౌతికంగా ఒకచోట గుమిగూడటం మంచిది కాదన్న ఉద్దేశ్యంతోనే ఆన్ లైన్లో నిర్వహించారు. అయితే కరోనా ఉధృతి దగ్గిందన్న ఉద్దేశ్యంతోనే ప్రత్యక్షంగా నిర్వహించాలని అనుకున్నారు. రాబోయే మహానాడుకు సుమారు 15 వేల మంది నేతలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఇదే సందర్భంలో మహానాడుకు ముందు తెలంగాణా, ఏపీ మొత్తంలోని అన్నీ నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. మినీ మహానాడులో కొన్నింటిని నియోజకవర్గ కేంద్రాల్లోను మరికొన్నింటిని మండల హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు.
పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో భాగంగా జనాలను దగ్గర చేయటానికి మినీ మహానాడు నిర్వహించాలని నాయకత్వం డిసైడ్ అయ్యింది. పనిలో పనిగా పార్టీ సభ్యత్వం నమోదు కూడా టేకప్ చేసింది నాయకత్వం. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పార్టీ సభ్యత్వాన్ని చేసి మహానాడు సమయానికి మొత్తం సభ్యత్వాన్ని ఫైనల్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.