మరోసారి సీఎం జగనే.. ఇది గ్రహాలు చెబుతున్నమాట!

Update: 2022-04-02 03:33 GMT
ఎవరెన్ని చెప్పినా.. ఎంతలా ప్రచారం చేసినా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు ప్రముఖ జ్యోతిష పండితుడు మాండ్రు నారాయణ రమణారావు సిద్ధాంతి. మిగిలిన ఏడాదంతా ఎలా ఉన్నా.. ఉగాది వస్తుందన్నంతనే పంచాంగం.. జోస్యాలు.. గ్రహాల అనుగ్రహాల గురించి.. ఏ రాశి వారికి ఎలా ఉందన్న దానిపై బోలెండ చర్చ జరగటంతో పాటు.. పండితులు సైతం తమ అభిప్రాయాల్ని పెద్ద ఎత్తున వెల్లడిస్తుంటారు.

తాజాగా రమణారావు సిద్ధాంతి సైతం ఇదే పని చేశారు. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్ ముందు చిత్తు అవుతారని ఆయన చెబుతున్నారు. ఏపీ సచివాలయంలో ప్రతికూల శక్తులు బలంగా పని చేస్తున్నాయని.. అక్కడ మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత గ్రహాలు.. నక్షత్రాల స్థితుల్ని చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రిగాజగన్ మరోసారి అధికారాన్ని సొంతం చేసుకోవటం ఖాయమన్నారు. జగన్ గ్రహాలు కుజుడు..రవి..చంద్రుడు.. శని.. శుక్ర గ్రహాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయని.. దీనికి తోడు ఛాయా గ్రహాలైనప రాహు.. కేతువులు మే నుంచి సానుకూల ప్రభావాన్ని చూపించనున్నట్లు పేర్కొన్నారు.

జగన్ కున్న గ్రహాల సానుకూలతల వల్ల వచ్చే ఎన్నికల్లో 120 - 150 మధ్య సీట్లలో ఆయన గెలిచి అధికారాన్ని చేపడతారన్నారు. ఇప్పుడున్నట్లు కాకుండా తూర్పు ఆగ్నేయ స్థానంలో కూర్చొని పాలన చేస్తే రాజకీయంగా మరింత పట్టు పెరుగుతుందన్న మాట చెప్పారు. ఏపీ సెక్రటేరియట్ వాస్తు ఆధ్వానంగా ఉందని.. ఈ కారణంగానే సచివాలయంలో ప్రతికూల శక్తులు బలంగా ఉన్నాయన్నారు. సెక్రటేరియట్ లో కొన్ని మార్పుల చేస్తే.. కోర్టు కేసులు.. పెండింగ్ పనుల్లో కదలిక వస్తుందన్నారు. అసెంబ్లీ నిర్మాణంలోనూ లోపాలు ఉన్నాయని.. వాటిని సరి చేస్తే కానీ మూడు రాజధానుల కల నెరవేరుతుందన్నారు.

జగన్ జాతకం దివ్యంగా.. ఆయన గ్రహాలు.. నక్షత్రాలు ఆయన్నుఅధికారం దిశగా అడుగులు పడేలా చేస్తుంటే.. మరోవైపు విపక్ష నేత చంద్రబాబు జాతకం చూస్తే.. ఆయనకు సంబంధించిన ముఖ్య గ్రహాలు రోజురోజుకు బలహీనపడుతున్నాయన్నారు. ముఖ్యంగా రవి.. శని.. శుక్ర.. చంద్ర గ్రహాలతో పాటు.. ఛాయా గ్రహాలైన రాహు.. కేతువులు పూర్తిగా నీరసపడుతున్నారన్నారు. ఈ గ్రహాల స్థితి ఇలానే కొనసాగితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేనట్లేనని చెప్పారు.

ఈ కారణంగానే చంద్రబాబుతో జత కట్టిన వారి గ్రహ బలం బాగున్నా.. బాబు గ్రహాల పుణ్యమా అని నీరసించిపోవటమే కాదు.. వారి రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు గ్రహబలాల్ని చూస్తే.. ఇప్పట్లో ఆయనకు రాజకీయ యోగం లేదన్న విషయాన్ని వెల్లడించారు.
Tags:    

Similar News