తమ మాటలతో, చేతలతో ఎప్పుడు ఏదో వివాదంలో చిక్కుకునే జేసీ బ్రదర్స్.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఈ టీడీపీ సీనియర్ నేతలు ఇప్పుడు ఎందుకు యాక్టివ్‌గా ఉండడం లేదు? అంటే సొంత పార్టీపై అసంతృప్తే అందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. కానీ వాళ్లు ఇలా సైలెంట్‌గా ఉంటుందని వైసీపీ ప్రభుత్వానికి భయపడి మాత్రం కాదంటా.. టీడీపీపై అసంతృప్తే అందుకు కారణమని తెలుస్తోంది.
అక్కడ బలం ఉందని..
అనంతపురం జిల్లా రాజకీయాలపై జేసీ సోదరులకు పట్టుంది. ఆ జిల్లాలో తమ మాటే నెగ్గాలని వాళ్లు కోరుకుంటారనే అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తమకు ప్రాబల్యం ఉన్న తాడిపత్రి, అనంతపురం టౌన్, శింగనమల, పుట్టపర్తి, కల్యాణదుర్గం వంటి నియోజకవర్గాల్లో తమ పట్టు చూపించాలని భావిస్తుంటారు. అక్కత తమకు అభిమానులున్నారని, ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందని వాళ్ల నమ్మకం. అందుకే ఈ జేసీ బ్రదర్స్ తరచూ ఈ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ హడావుడి చేస్తుంటారు.
టీడీపీ ఆదేశాలు..
తమ సొంత నియోజకవర్గం తాడిపత్రిలో మరో టీడీపీ నేత అడుగుపెట్టడానికి కూడా అనుమతించని జేసీ బ్రదర్స్.. మిగిలి నియోజకవర్గాల్లో మాత్రం స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అక్కడి టీడీపీ నేతలకు కనీస సమాచారం లేకుండా పర్యటనలు చేస్తుంటారు ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం గతంలో గట్టి ఆదేశాలు జారీ చేసింది. లోకల్ నాయకుల సమ్మతి లేకుండా ఒకరి నియోజకవర్గంలో మరొకరు పర్యటించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. జేసీ బ్రదర్స్ దూకుడుకు అడ్డుకట్ట వేసింది. దీన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తుంటే తమపై పార్టీలోని ఓ వర్గం దుష్ప్రచారం చేస్తుందని జేసీ బ్రదర్స్ చెబుతున్నారు.
మరోవైపు జిల్లా కమిటీల్లోనూ జేసీ వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొండి చెయ్యి చూపారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో వాళ్లు సైలెంట్ అయిపోయారు. నేరుగా చంద్రబాబుతోనే తేల్చుకోవాలని జేసీ బ్రదర్స్ భావిస్తున్నట్లు సమాచారం. తమంతట తాముగా కాకుండా బాబు పిలిస్తేనే వెళ్లాలని వాళ్లు భావిస్తున్నారు. అందుకే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సైలెంట్‌గా ఉంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి బాబు ఈ బ్రదర్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.