ఇక యుద్ధం ముగిసినట్లే..! శాంతి చర్చలు సపలం..

Update: 2022-03-30 07:31 GMT
నెల రోజులకు పైగా కొనసాగిన రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం ఇక ముగిసినట్లేనని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి  చర్చలపై ఒక అంగీకారానికి రావడంతో ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఆగిపోయింది. మొన్నటి వరకు బాంబుల మోతతో తల్లడిల్లిన ఉక్రెయిన్లో ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చల్లో రష్యా ఒక మొట్టు దిగింది. ఉక్రెయిన్లోని తన బలగాలనే వెనక్కి రప్పించేందుకు ఒప్పుకుంది. అటు ఉక్రెయిన్ రష్యా పెట్టిన షరతులకు అంగీకారం తెలిపింది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలైన కీవ్, చెర్నివేవ్ ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రష్యా సేనలు విత్ డ్రా చేసుకోవడం గమనించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. దీంతో శాంతి చర్చలు సఫలమయ్యాయి.

ఇదిలా ఉండగా ఉక్రెయిన్ భద్రత విషయంలోనూ ఆ దేశ అధ్యక్సుడు జెలెన్ స్కీ కొన్ని డిమాండ్లను ముందుంచారు. అయితే ఉక్రెయిన్ చేసిన డిమాండ్లను ఒప్పుకున్నా.. ఆ దేశానికి మాత్రం రష్యా షరతులు పెట్టింది. భవిష్యత్లో కూడా నాటోలో చేరవద్దని అన్నారు. దీనికి ఉక్రెయిన్ నాటోలో చేరకుండా తటస్థంగా  ఉంటుందని అధ్యక్షుడు జెలెన్ స్కీ  ప్రకటించారు. డాన్ బాస్ ప్రాంతమైనా కూడా తాము రాజీ పడుతామని చెప్పారు. ఇరు పక్షాలు ఒక్కో మెట్టు దిగిరావడంతో ఇక యుద్ధానికి తెరపడినట్లేనని అంటున్నారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఇరు దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్ స్కీలు త్వరలో భేటీ అవుతారని ప్రకటించారు.

టర్కీ వేదికగా జరిగిన ఈ చర్యల్లో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చామని ఆ దేశం ప్రకటించింది. మాస్కో ముప్పుగా భావించే నాటోలో ఉక్రెయిన్ చేరకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఆ విషయంలో మెట్టు దిగని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇప్పడు అదే విషయంలో మెట్టు దిగాడు. తాము నాటోలో చేరకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించారు. అయితే శాంతి చర్చల్లో మరో ఒప్పందం చేసుకున్నారు. ఉక్రెయిన్ భద్రతా హామీలు అవసరమని జెలెన్ స్కీ తెలిపారు. దేశానికి సొంతంగా భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఓ వైపు శాంతి చర్చలు సఫలం కావడంతో ఉక్రెయిన్లోని మూడు నగరాల నుంచి పౌరులను తరలిస్తున్నామని ప్రకటించింది. భారీ బాంబులతో ఇప్పటికే మారియపోల్ తో పాటు ఎనర్ హోదర్, మెలిటో పోల్ నుంచి కారిడార్లు నడుస్తున్నాయని ఉప ప్రధానమంత్రి ఇరినా వెరెష్ చుక్ తెలిపారు. ప్రస్తుతం రెండు నగరాలు రష్యా నియంత్రణలో ఉన్నాయి.అయితే మాస్కో కారిడార్ లకు ఎంత మేరకు అంగీకరిస్తుందో చెప్పలేదు.
Tags:    

Similar News