రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వాతావరణం దాదాపుగా వచ్చేసినట్లే లెక్కేసుకోవాలి. ఏపీలో అయితే బస్తీ మే సవాల్ అని అటూ ఇటూ కూడా తొడకొడుతున్నారు. జగన్ దిగిపోకతప్పదని జనసేనాని సీరియస్ వార్నింగ్ ఇచ్చేశాక ఏపీలో పొలిటికల్ సీన్ కంప్లీట్ గా చేంజ్ అయింది. పవన్ కామెంట్స్ అధికార వైసీపీ కూడా సీరియస్ గానే తీసుకుంటోంది. దాంతో ఇపుడు ఏపీలో పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. ఆ సంగతి అలా ఉంటే తెలంగాణాలో కూడా రాజకీయం రంజుగా సాగుతోంది.
అయితే ఏపీకి తెలంగాణాకు చాలా తేడా ఉంది. ఏపీలో దాదాపుగా అన్ని పార్టీలు ఒకే గొంతుతో జగన్ దిగిపోవాలని గట్టిగా కోరుతున్నాయి. ప్రధాన పార్టీలు ఒక కూటమిగా కూడా ముందుకు రాబోతున్నాయి. అది జగన్ కి పెను సవాల్ గా మారనుంది.
తెలంగాణాలో అలా కాదు, కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకీ బలంగా ఉన్నా వారిలో వారికి పొసగడంలేదు. ముందు వారు సొంత పార్టీలో తగవు తీర్చుకుంటే ఆనక బయట పార్టీతో పోరుకు రెడీ అవుతారు. కానీ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ గా టీ కాంగ్రెస్ లో పోరు ఒక లెక్కన సాగుతోంది. దాంతో టీయారెస్ ని వారు దాదాపుగా పక్కన పెట్టేసినట్లు అవుతోంది.
ఇది ఒక విధంగా అధికార పార్టీకి వరంగా మారే అవకాశం ఉంది. ఇంకో వైపు చూసుకుంటే కాంగ్రెస్ కి బీజేపీకి అసలు పడదు, వారిద్దరిదీ జాతీయ వైరం, జాతి వైరం. దాంతో ఆ రెండు పార్టీలు టీయారెస్ ని కూలదోసి అధికారంలోకి రావాలన్న పరుగు పందేనికి ముందు తమలో ఒకరిని ఎలిమినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రేస్ ఇలా సాగుతూండగానే కారు హై వే రోడ్డు మీద హ్యాపీగా యమ జోరుగా సాగిపోతూనే ఉంటుంది.
ఇక కేసీయార్ కి మిత్రుడిగా ఎంఐఎం ఉంది. దాంతో పాటు వామపక్షాలను కూడా ఈసారి కలుపుకునే యోచనలో గులాబీ పార్టీ ఉంది. ఈసారి కేసీయార్ సెంటిమెంట్ ని పక్కన పెట్టి కొత్త రూట్లో వస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో టీయారెస్ అంటూ ఆయన ఇస్తున్న నినాదం తెలంగాణాలో మరోసారి ఆ పార్టీని గెలిపించడానికి కారణం అవుతుంది అంటున్నారు.
బంగారు భారతం పేరుతో ఇప్పటికే ప్రచాం ముమ్మరం చేసిన కేసీయార్ జాతీయ స్థాయిలో బరి గీసి తెలంగాణాలో ఆట ఆడడానికి ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నారు. దీని వల్ల వస్తే జాతీయ గుర్తింపు గ్యారంటీ. లేకపోయినా ముచ్చటగా మూడవసారి గెలుపు తెలంగాణాలో ఖాయం. ఇదే కేసీయార్ స్ట్రాటజీ అంటున్నారు. ఇక కేసీయార్ విషయంలో మరోటి ఏంటి అంటే ఆయన కాంగ్రెస్ ని వదిలేసి ఈసారి బీజేపీ మీద పడుతున్నారు. నిజానికి తెలంగాణాలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అయినా సరే కేసీయార్ ఆ పార్టీని చూపించి తమ రాజకీయ కధను రక్తి కట్టిస్తారు.
ఇప్పటిదాకా చేసిన సర్వేల్లో బీజేపీకి తెలంగాణాలో పదికంటే ఎక్కువ సీట్లు రావని తేలిందని టీయారెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తెచ్చుకున్నా అధికారంలోకి రాలేదు. దాంతో కేసీయార్ చెబుతున్నట్లుగా తొంబై నుంచి వంద సీట్లు కాకపోయిన డెబ్బై నుంచి ఎనభై దాకా సాధించి అయినా మళ్ళీ మూడవసారి పవర్ లోకి వస్తారు అని అంటున్నారు.
ఇక ఏపీలో చూస్తే జగన్ రెండవసారి అధికారంలోకి రావాలీ అంటే చాలానే చేయాలి. ఇక్కడ ప్రతిపక్షం బలంగా ఉంది. ఏకత్రాటిమీద ఉంది. పైగా వైసీపీ దగ్గర కొత్త నినాదాలు లేవు. కేవలం ప్రశాంత్ కిశోర్ వ్యూహాలనే నమ్ముకున్నారు. మరో వైపు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చరాదు అని ఒట్టేసుకుంది విపక్షం. దాంతో జగన్ రెండు ఆశలు ఎంతవరకు తీరుతాయో చూడాల్సిందే.