ఏపీ అధికార పార్టీ వైసీపీలో పార్టీ పండుగ ప్లీనరీనిఅత్యంత వేడుకగా నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం సర్వం సిద్ధం చేసుకుంది. అన్ని రూపాల్లోనూ.. అన్ని వర్గాలకు.. ఈ ప్లీనరి వేదికగా..గట్టిసందేశం ఇవ్వాల ని.. పార్టీన నిర్ణయించుకుంది. అంతేకాదు.. తమపై వస్తున్న విమర్శలకు..వచ్చే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలకు కూడా పదును పెట్టనుందనే చర్చ సాగుతోంది. అయితే.. ఇప్పుడు ఇన్ని ఆశలు కూడా రెబల్స్ ముందు.. పక్కకు జారిపోతున్నాయని అంటున్నారు పరిశీలకులు.
వైసీపీలో జగన్ కోటరిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారధి, మేకతోటి సుచరిత, ఆళ్ల నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి (ఎమ్మెల్సీ) ఇలా చాలామంది తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
కొందరికి మంత్రి పదవి దక్కలేదని.. మరికొందరికి అసలు ఉన్నది కూడా పోయిందని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వారు అంతర్గతంగా కుమిలిపోతూ.. పార్టీ అధిష్టానంపై తీవ్ర అసహ నంతో ఉన్నారు.
ఇలాంటి సంక్లిష్ట సమయంలో పార్టీ ప్లీనరి ఏర్పాటు చేయడం.. చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ప్లీనరీ విజయం కావాలంటే.. ఇలాంటి మాస్ నాయకులను పక్కన పెట్టడం అనే సమస్య ఉండదు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలి. పైగా జనాలను తరలించాలి. మంచి వాయిస్‌వినిపించాలి. ప్రతిపక్షాల చెవుల్లో దిమ్మతిరిగిపోయే కౌంటర్లు పేలిపోవాలి. అయితే..ఇప్పుడు ఇవన్నీ.. సాధ్యమేనా.. ప్రస్తుతం తీవ్ర ఆగ్రహంతో ఉన్న నాయకులు ముందుకు కదులుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎందుకంటే.. ప్లీనరీ ద్వారా.. వైసీపీ సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మూడేళ్ల సమయం గడిచిపోయింది. భారీ ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని.. ప్రభుత్వం చెబుతున్నా.. వైసీ పీ ఎమ్మెల్యే లే అభివృద్ధి లేదని.. డ్రైనేజీల్లో పడుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఇలాంటి సమయంలో ముందు ఇంటిపోరును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు. లేకపోతే..పార్టీపై తీవ్ర పరిణామాలు పడతాయని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.