టీ20 వరల్డ్ కప్: నెదర్లాండ్స్ టీంలో విజయవాడ అబ్బాయి.. ఎవరో మీకు తెలుసా?
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. అంతటా మనవాళ్లే ఉంటున్నారు. బ్రిటన్ ప్రధాని నుంచి అమెరికా ఉపాధ్యక్షుడి వరకూ..గూగుల్ సీఈవో నుంచి మైక్రోసాఫ్ట్ అధినేత వరకూ అందరూ భారతీయులే ఉంటున్నారు. ప్రపంచదేశాలకు ప్రధానులుగా.. అధ్యక్షులుగా చాలా మంది కొనసాగుతున్నారు.
ఇక ప్రపంచ క్రికెట్ లోనూ భారతీయుల హవా ఉంది. చాలా జట్లలో మన భారతీయులు ఉన్నారు. టీమిండియాలోనే కాదు.. ఇతర దేశాల టీంలోనూ ప్రవాస భారతీయులు చోటు సంపాదించి ఆ దేశపు జట్లలో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ టీంలోని 15 ఆటగాళ్లలోని బ్యాటర్ అనిల్ తేజ నిడమనూరు కూడా ఒకరు. ఇతడిది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన వాడని చాలామందికి తెలియదు.
అనిల్ తేజ ఇండియాలో పుట్టి నెదర్లాండ్స్ లో సెటిల్ అయ్యాడు. తర్వాత నెదర్లాండ్స్ క్రికెట్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. తేజ న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ తరుపున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. తర్వాత నెదర్లాండ్స్ వెళ్లి అక్కడ జాతీయ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు.
ఇక వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన తేజ.. తొలి మ్యాచ్ లోనే 51 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇప్పుడు నెదర్లాండ్స్ టీ20 టీంలో సభ్యుడు.