ఏపీలో రాజకీయ మాటల కోలాటం.. రంజుగా సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కన్నా.. జనసేన వర్సె స్ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఏలూరులో పవన్ కళ్యాణ్ కౌలు రైతులను పరా మర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తనను సీబీఎన్ దత్తపుత్రుడు అంటే... తాను జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడు అంటానని అన్నారు. ఇక, దీనిపై ఏపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ సహా... మరోమంత్రి అంబటి రాంబాబులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
గుడివాడ అమర్నాథ్.. ఏకంగా.. దత్తపుత్రుడు సినిమా తీసేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పారు. రాం బాబు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి గా విరుచుకుపడ్డారు. ఆయా ప్రాంతాల్లో వారు మీడియాతో మాట్లాడుతూ... మంత్రుల పై వ్యక్తిగత విమర్శ లు చేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి, పోతిన మహేష్ తదితరులు ఘాటుగా స్పం దించారు. తమ వద్ద రాసలీలల స్క్రిప్ట్ రెడీగా ఉందని.. మంత్రులు ఒప్పుకుంటే హీరోయిన్లను కూడా సెలెక్ట్ చేస్తామంటూ సెటైర్లు వేశారు.
అంబటి, గుడివాడలకు ఒకటే చెబుతున్నాం - రాసలీలల స్క్రిప్ట్ రెడీగా ఉంది.. మీరు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. మీరు ఓకే అంటే మంచి రాసలీలల స్క్రిప్ట్ తో సినిమా తీద్దాం. మంత్రులుగా ఉన్నప్పు డు సమస్యల మీద మాట్లాడండి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తే మేము కూడా మీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లేందుకు సిద్ధం.
మీలాంటి వారికీ మంత్రి పదవి ఇవ్వడమే ఎక్కువ. ఎన్నో లెక్కలు వేసి సీబీఐ దత్తపు త్రుడు జగన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారు. మీలాంటి వారిని పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా రానివ్వరు గుర్తు పెట్టుకోండి అని మధుసూదనరెడ్డి నిప్పలు చెరిగారు.
ఇక, మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు పొత్తుకు, మద్దతుకు తేడా తెలియడం లేదని విమర్శించారు. 2014లో టీడీపీకి కేవలం జనసేన పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు. అనంతరం 2019లో అప్పటి ప్రభుత్వం హయాం లో జరిగిన తప్పులను బహిరంగంగా ప్రశ్నించామని తెలిపారు. గతంలో ఏ కార్యక్రమం చేసినా బూతులతో రెచ్చిపోయే మంత్రులు ఉంటే, ఇప్పుడు అయోమయం మంత్రులు ఉన్నారని విరుచుకుపడ్డారు. గతంలో ఇష్టాను సారం అవాకులు చవాకులు పేలిన బూతుల మంత్రికి గొడ్ల చావడిలో పడుకునే గతి పట్టిందని.., ఆ గతే మీకు పడుతుందంటూ హెచ్చరించారు.
మరోవైపు పోతిన మహేష్.. విజయవాడలో మాట్లాడుతూ.. . అంబటికి ఇచ్చింది జలవనరుల శాఖ అని.. స్విమ్మింగ్ పూల్ శాఖ కాదని ఎద్దేవా చేశారు. తమ దగ్గరకూడా సీబీఐ దత్తపుత్రుడు, బాత్ రూమ్ లో బాబాయ్, సంజన-సుకన్య సినిమాలకు స్కిప్ట్ సిద్ధంగా ఉందని.. డబ్బులేకపోతే జనసైనికులే చందాలు వేసుకొని ఇస్తామంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి ఈ పరిణామంతో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య తీవ్ర యద్ధం మొదలైందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.