కొంద‌రికి ఇష్టం.. కొంద‌రికి క‌ష్ట‌మా... జ‌గ‌న్ చుట్టూ రాజ‌కీయం...!

Update: 2022-12-01 15:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొంద‌రికి ఇష్టంగాను..మ‌రి కొంద‌రికి క‌ష్టంగాను రాజ‌కీయాలు.. మారుతున్నాయ ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ అధినేత,సీఎం జ‌గ‌న్ వైఖ‌రి కొంద‌రికి ఇష్టంగా ఉంటే.. మ‌రికొంద‌రికి క‌ష్టంగా ఉంద‌ని తెలుస్తోంది. ఎలాగంటే..  వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుల‌ను రంగంలోకిదింపాల‌ని శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు నాయ‌కులు రెడీ అయ్యారు. అయితే, యునానిమ‌స్‌గా సీఎం జ‌గ‌న్ అలా కుద‌ర‌దు అని తేల్చిచెప్పారు.

అయితే.. ఇదే స‌మ‌యంలో కొంద‌రి విష‌యంలో మాత్రం ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉదా హర‌ణ‌కు చంద్ర‌గిరి ఎమ్మెల్యేచెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు మోహిత్‌కు పార్టీ అధిష్టానం ప‌చ్చ‌జెండా ఊపింద‌ని అంటున్నారు. ఈ విష‌యం చంద్ర‌గిరిలో జోరుగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇక ఇదేస‌మ యంలో కాదు కాద‌ని అంటున్న ఆముదాల వ‌ల‌స‌లోనూ యువ నాయ‌కుడికి టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని తెలుస్తోంది.

అదేవిధంగా ధ‌ర్మాన ఇంటి నుంచి కూడా ఈ సారి యువ నేత బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. దీనికి కూడా అధిష్టానం ఓకే చెప్పింద‌ని అంటున్నారు. అయితే, కొంద‌రి విష‌యంలో మాత్రం దీనికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. మ‌చిలీప‌ట్నం నుంచి యువ నాయ‌కుడికి ప‌చ్చ‌జెండా ఊప‌డం లేదు. మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డికి కూడా అధిష్టానం ఓకే చెప్ప‌డం లేదు. చిత్తూరులో కీల‌క నేత‌ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది.

అంటే.. కొంద‌రి విష‌యంలో వారుసుల‌కు ఓకే చెబుతున్న అధిష్టానం మ‌రికొంద‌రికి మాత్రం వ‌ద్ద‌ని అంటోంది. అయితే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు కీల‌క‌మైనవ‌ని భావిస్తుండ‌డ‌మే కార‌ణ‌మా?  లేక‌.. రాజ‌కీయ వ్యూహం ఏదైనా ఉందా?   వార‌సుల‌కు టికెట్లు ఇస్తే ప‌రిస్థితి త‌ల‌కింద‌లు అవుతుంద‌ని చెబుతున్న ముఖ్య‌మంత్రే ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News