తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని అంతా అంటారు. నిజానికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాకనే బీసీల గొంతు వినిపించింది. రాజకీయాల్లో వారికి సమ న్యాయం జరిగింది. బీసీలకు ఎన్టీయార్ పెద్ద పీట వేశారు. అలాగే ఎందరో యువకులకు ఆయన ఎమ్మెల్యేలు మంత్రులుగా అవకాశాలు ఇచ్చారు. అలాంటి టీడీపీ బాబు నాయకత్వంలోకి వెళ్లాక కొంత వ్యాపార దృక్పధంలోకి వెళ్ళిందని విమర్శలు ఉన్నాయి.
ఇక టీడీపీలో చూసుకుంటే బాబు కూడా బీసీలకు పదవులు ఇచ్చినా ఎందుకో ఆ పార్టీలో పెత్తనం కమ్మ సామాజికవర్గానిదే అన్న ప్రచారం సాగింది. దానికి తోడు అన్నట్లుగా రాజ్య సభ సీట్లు ఎక్కువగా వారికే దక్కేవి. కొన్ని కీలకమైన చోట్ల వారే ఎంపీలుగా ఉంటూ వచ్చారు. నామినేటెడ్ పదవులు కూడా అలాగే ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి వాటినే వైసీపీ సొమ్ము చేసుకుని విపరీతంగా ప్రచారం చేసి టీడీపీని ఓడించగలిగింది.
మరి టీడీపీ ఇపుడు విపక్షంలో ఉంది. అన్ని సామాజిక వర్గాలు ఇపుడు రావాలి, పార్టీకి కావాలి. కానీ టీడీపీ గెలవాలి అంటున్న గొంతులు మాత్రం మళ్ళీ ఒక సెక్షన్ నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారే గట్టిగా టీడీపీ కోసం డిమాండ్ చేస్తున్నారు. నిజానికి వారు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వారు. ఈ రాష్ట్రానికే సంబంధం లేని వారు. వారు చంద్రబాబు సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు.
వారే టాలీవుడ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్. ఈ ఇద్దరూ టీడీపీ వీరాభిమానులుగా ముద్ర పడిన వారు నేరుగా అయితే సభ్యత్వం ఉందో లేదో తెలియదు. అశ్వనీదత్ అయితే 2004 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడారు. ఆయనకు బాబుతో మంచి అనుబంధం ఉంది. కె రాఘవేంద్రరావు అయితే టీటీడీ చానల్ చైర్మన్ గా ఉన్నారు.
ఇపుడు ఈ ఇద్దరికీ అర్జంటుగా బాబు సీఎం కావాలన్న తాపత్రయం ఎక్కువ అయిపోయింది. వారు మనసులో ఏదీ దాచుకోకుండా మీడియా ముందుకు వచ్చి మరీ గట్టిగా మాట్లాడుతున్నారు. కె రాఘవేంద్రరావు అయితే ఆ మధ్య గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో బాబే మళ్లీ సీఎం అంటూ జోస్యం చెప్పారు. ఇపుడు అశ్వనీదత్ వంతు. ఆయన కూడా బాబే రాబోతున్నాడు అని సౌండ్ చేస్తున్నారు. నిజమే వారికి టీడీపీ రావాలని ఉండొచ్చు. కానీ వారు బయటకు పదే పదే అనడం వల్ల లాభం కంటే నష్టం జరుగుతుంది అని ఎందుకు ఊహించలేకపోతున్నారు అన్నదే ప్రశ్న.
అదే విధంగా కమ్మ కలర్స్ ని కావాలనే పార్టీకి అద్దుతున్నారు అని కూడా అంటున్నారు. అదే ఏ బీసీ నేతలో మరో సామాజికవర్గం వారే అంటే అపుడు టీడీపీకి హై పెరిగేది, ముద్ర కూడా పోయేది. కానీ కమ్మ వారే పనిగట్టుకుని టీడీపీ రావాలని అనడం, అలాగే అమరావతిలో భూములు కొన్నవారే టీడీపీ సానుభూతిపరులుగా ఉంటూ మీడియాలో హల్ చల్ చేయడం వల్ల లాభం కంటే ఇబ్బందులే వస్తాయని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు చంద్రబాబును కలవడం వెనక కూడా కమ్మదనమే ఉందని అపుడే ప్రచారం మొదలైంది. ఇలాంటివి కాస్తా ఆపుకోకుంటే మళ్ళీ టీడీపీ మీద ఆ ఇంప్రెషన్ ని స్ట్రాంగ్ గా వేసి మరీ తన రాజకీయం చేయడానికి అధికారం పక్షం రెడీగా ఉంది అంటున్నారు.