పేదలంటే గౌరవం ఉండాలిగా, వారు కూడా రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పౌరులు కారా. వారికి కూడా జీవించే హక్కు ఉంది కదా. వారి మనోభావాలు ఏ కొశానా ఎవరికీ పట్టవా. ఇవీ హై కోర్టు వైసీపీ ప్రభుత్వాన్ని వేసిన ప్రశ్నలు. వారికి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళ స్థలాలను కేటాయించవచ్చా. ఇదేమి ధర్మమని ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీసింది.
ఇంతకీ విషయం ఏంటి అంటే జగనన్న ఇళ్ళ కాలనీల పేరిట ఏపీవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇచ్చేసింది. అందులో శ్మశానాలు ఉన్నాయి. అలాగే చెరువు కుంటలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. దాంతో అక్కడ నివాసయోగ్యం కాదు అని ఎలా ఇల్లు కట్టుకోవాలని పేదలు ఇప్పటిదాకా అతి పెద్ద గోల పెడుతూ వచ్చారు. ఇక విపక్షాలు అయితే ఇది పద్ధతి కాదు అని చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు.
అయినా సరే ముప్పయి మూడు లక్షల ఇళ్ళు కట్టించి ఇస్తామని రికార్డు కోసం టముకు వేసుకున్న వైసీపీ పెద్దలకు వాస్తవాలు ఏవీ వంటబట్టలేదు. దాంతో చిర్రెత్తిన కపిలేశ్వరం వాసి యాకోబు అనే వ్యక్తి హై కోర్టులో ఒక ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించిన హై కోర్టు శ్మశానంలో ఇళ్ళు ఎక్కడైనా కేటాయిస్తారా అంటూ మండిపడింది. పేదలకు గౌరవం ఇవ్వవద్దా అంటూ పేర్కొంది.
దీంతో సర్కార్ కి గట్టి షాక్ తగిలినట్లు అయింది. వారికి ఆల్టర్నేషన్ గా స్థలాలు చూపించాల్సి ఉంది. అయితే ఏపీలో 33 లక్షల ఇళ్ళు అని చెబుతున్న ప్రభుత్వానికి ఆది నుంచి ఇళ్ళ స్థలాలే పెద్ద సమస్యగా మారింది. అలాంటపుడు దశలవారీగా ఇళ్ళ స్థలాలను ఇస్తే ఎవరూ ఆక్షేపించేవారు కాదు, కానీ అతి ఉత్సాహంతో చేసిన ఈ పని వల్ల ఇపుడు ఏకంగా అసలుకే ఎసరు వచ్చేట్టుంది అంటున్నారు.
ఈ ఒక్క విషయమే కాదు రాజధాని అమరావతిలో కూడా మాస్టర్ ప్లాన్, జోనల్ రెగ్యులేషన్స్, సీఆర్‌డీఏ భూ కేటాయింపుల విధానానికి వ్యతిరేకంగా ఇళ్ళను వేరే వారికి కేటాయిస్తున్నారు అన్న పిటిషన్ మీద హై కోర్టులో విచారణ సాగుతోంది. మొత్తానికి చూస్తే వైసీపీ చేస్తున్న పనులు రాణింపునకు నోచుకోవడంలేదు.
ఏదో చేశామని చెప్పుకుంటే సరిపోతుందా దాని వల్ల లబ్దిదారులు కూడా హాయిగా ఉన్నామని అనుకోవాలి కదా అన్న మాట వినిపిస్తోంది. ఇపుడు హైకోర్టు తలంటిన తరువాత అయినా శ్మశానాలు, లోతట్టు ప్రాంతాలలో ఇళ్ళ స్థలాలను ఇవ్వకుండా చూసుకోవాలి. లేకపోతే ఇచ్చామన్న పేరు ఉండదు, ఇచ్చినట్లే ఇచ్చి ఇలా చేశారు అంటే జనాలు ఏకంగా మండిపోతారు. అసలే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి మరి.