`తిరుప‌తి` కావాలి.. వైసీపీ యంగ్ లీడ‌ర్ కోరిక తీరేనా..!

Update: 2023-02-01 05:00 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఆశ‌లు పెట్టుకున్న యువ‌నాయ‌కుల సంఖ్య వైసీపీలోను, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోనూ పెద్ద ఎత్తున పెరుగుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ గెలుపుగుర్రం ఎక్కుతుంద‌నే ఆశ‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో యువ నాయ‌కులు భారీగా టికెట్ల వేట‌లో ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం త‌న‌కు కావాలని.. త‌న‌కు సెంటిమెంటుగా ఉంద‌ని.. ఇటీవ‌ల బ‌ల్లి క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి.. సీనియ‌ర్ నేత వ‌ద్ద మొర‌పెట్టుకున్నార‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బ‌ల్లి దుర్గాప్ర‌సాద్.. 2019 ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే, రెండేళ్ల‌కే ఆయ‌న‌ అనారోగ్య కార‌ణంగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈయ‌న మృతితో ఈ కుటుంబంలోని ఆయ‌న కుమారుడు క‌ళ్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి త‌న‌కు ఎంపీ టికెట్ ఇస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు.

అయితే..ఆ స‌మ‌యంలో ఆయ‌న‌ను ఒప్పించేందుకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్టు ఇప్పుడు క‌ళ్యాణ్ వ‌ర్గం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే బ‌ల్లి క‌ళ్యాణ్‌.. గ‌త జ‌గ‌న్ హామీని గుర్తు చేస్తూ.. సీమ‌కు చెందిన కీల‌క నేత‌ను క‌లిసార‌ని.. ఆయ‌న వ‌ద్ద మొర‌పెట్ట‌ కున్నార‌ని అంటున్నారు.

అయితే, హామీల విష‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ విష‌యంపై తాను కూడా సీఎం జ‌గ‌న్‌తో మాట్లాడ‌తాన‌ని, అయితే.. తిరుప‌తి ఎంపీ టికెట్ మాత్రం ద‌క్కేలా లేద‌ని.. దీనిపై ఆశ‌లు వ‌దులుకుని వేరే ఎస్సీ నియోజ క‌వ‌ర్గం ఎంపిక చేసుకుంటే.. అక్క‌డ నుంచి ప్ర‌య‌త్నం చేయొచ్చ‌ని.. స‌ద‌రు మాజీ ఎంపీ కూడా అయిన నాయ‌కుడు హామీ ఇచ్చార‌ని అంటున్నారు.

అయితే.. ఇప్పుడు బ‌ల్లికి ఉన్న ఆప్ష‌న్.. గూడూరు. గ‌తంలో ఇక్క‌డ దుర్గాప్ర‌సాద్ టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. సో.. ఇక్క‌డ నుంచి ఆయ‌న పోటీ చేస్తానంటే.. పార్టీ ఆలోచించే అవ‌కాశం ఉంది. అయితే.. దీనికి క‌ళ్యాణ్ విముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ‌ర‌ప్ర‌సాద్ వైఖ‌రితో ఇక్క‌డ వైసీపీ పాజిటివ్ ఓటు బ్యాంకు అంతా క‌కావిక‌లం అయిపోయింద‌ని.. ఇప్పుడు ఇక్క‌డ టీడీపీ హ‌వా పెరిగింద‌ని..తాను పోటీ చేసినాప్ర‌యోజ‌నం లేద‌ని.. బ‌ల్లి త‌న వ‌ర్గంతో చెబుతున్న‌ట్టు మ‌రో ప్ర‌చారం ఉంది. ఎలా చూసుకున్నా.. తిరుప‌తి అయితేనే బెట‌ర్ అని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News