ఉద్యమాలు చేయాలి చేస్తేనే పార్టీలు బతుకుతాయి లేదా జనంలో లేకుండా చిరునామా కు కూడా అందకుండా పోతాయి. ఇదే మాట ప్రతిసారీ వినిపిస్తున్నారు బీజేపీ అధినాయకులు. ఇదే మాట పురందేశ్వరి తో సహా అంతా అంగీకరిస్తున్నారు. కుటుంబ పార్టీలకు భిన్నంగా రాజకీయం చేయాలన్నది ఎప్పటి నుంచో బీజేపీకి ఉన్న ఓ కోరిక అన్నది సుస్పష్టం. అందుకే ఈ సారి ఆ రెండు పార్టీలనూ దూరం పెడుతూనే ప్రజా ఉద్యమ గీతికలు వినిపించే క్రమాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉన్నారు.
నిన్నటి వేళ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఢిల్లీ లో కలిసి ఈ మేరకు సంబంధిత కార్యాచరణపై మాట్లాడారు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కు సంబంధించి అదేవిధంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఇటీవలే నిర్వహించిన జనపోరు యాత్ర వివరాలను కూడా వీర్రాజును ఆయన అడిగి తెలుసుకున్నారని ప్రధాన మీడియా చెబుతున్న వివరం.
రెండంటే రెండు ప్రధానం అనుకునే కుటుంబ పార్టీలు ఉన్నాయి. ఇవి రెండూ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి. అంతేకాదు దేశ రాజకీయాలనూ ప్రభావితం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇదే క్రమంలో గతంలోనూ కూటమి రాజకీయాలు నడిపాయి. అవే వైసీపీ మరియు టీడీపీ. ఒకప్పుడు బీజేపీతో టీడీపీ మంచి బంధాలనే సాగించింది. మంచి స్థాయిలోనే స్నేహ బంధాలు ఉంచి, తాను అనుకున్నవి కొన్ని సాధించగలిగింది.
ఇప్పుడిప్పుడే వస్తున్న మార్పుల కారణంగాటీడీపీ బీజేపీ పొత్తుపై అనుమానాలు వస్తున్నాయి. ఎలా అయిన బీజేపీతో వైసీపీ కూడా కలవడం లేదు. ఓ అఫీషియల్ నోట్ లో కూడా మా విపక్ష పార్టీ అయిన వైసీపీ అనే రాశారు మొన్నా మధ్య అంటే జగన్ నుకూడా విపక్ష నేతగానే పరిగణిస్తున్నారన్నది నిర్థారణ. కనుక మారుతున్న పరిణామాల నేపథ్యంలో కొత్త సమీకరణాలకు ఆస్కారం ఇచ్చేందుకు ఆ రెండు కుటుంబ పార్టీలకూ చెక్ పెట్టేందుకు అదేవిధంగా ఈ సారి పవన్ ను ప్రోత్సహించేందుకు బీజేపీ యోచన చేస్తోంది అన్నది ప్రాథమిక సమాచారం.
బీజేపీ కొత్త ఉత్సాహంతో ఉంది. కొత్త ఆలోచనతో కూడా ఉంది. గతం కన్నా భిన్నంగా పనిచేయాలన్న తలంపులో భాగంగా కొత్త సమీకరణాల సృష్టికి ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా కొత్త ఆలోచనకు ప్రతిరూపంగా పాత విధానాలకు తిలోదకాలు ఇచ్చేందుకు కూడా సిద్ధం అవుతోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ కొత్త నిర్ణయం ఒకటి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో టీడీపీతో దోస్తీ ఉన్నా కూడా అది ఫలితం ఇవ్వలేదు. కాస్తో కూస్తో 2019లో బీజేపీతో కలిసి ప్రయాణించినా పెద్దగా రాష్ట్రంలో బలం పుంజుకోలేదు. ఈ తరుణాన బీజేపీ తనదైన ప్రభావం చూపేందుకు ఇప్పుడిప్పుడే తన సరళిని మార్చుకుంటోంది.